Pan-Aadhaar Linking Deadline : పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ ఇదిగో.. ఈ తేదీలోగా లింక్ చేయలేదంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

Pan-Aadhaar Linking Deadline : ఐటీ చట్టం, 1961 ప్రకారం.. పన్ను చెల్లింపుదారులందరూ తమ పాన్ కార్డును ఈ తేదీలోగా తమ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా?

Pan-Aadhaar Linking Deadline : పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ ఇదిగో.. ఈ తేదీలోగా లింక్ చేయలేదంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

Pan-Aadhaar linking deadline extended, here is what will happen after June 30

Pan-Aadhaar Linking Deadline extended : ఆదాయపు పన్ను శాఖ గత నెలలో పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి గడువును పొడిగించింది. ఇంకా పాన్‌ (PAN Card) తో ఆధార్‌ (Aadhaar Card)ను లింక్ చేయని పన్ను చెల్లింపుదారులు తమ పాన్ కార్డ్ డియాక్టివేట్ కాకుండా ఉండేందుకు జూన్ 30లోగా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు పనిచేయకపోతే జరిగే పరిణామాలపై కూడా ఐటీ శాఖ (IT)  ముందుగానే క్లారిటీ ఇచ్చింది. చట్టంలోని సెక్షన్ 139AA సబ్-సెక్షన్ (2) ప్రకారం, 1 జూలై, 2017 నాటికి పాన్ కలిగిన ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్‌ (Pan Aadhaar Card Linking Status) ను అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్, పాన్‌లను అనుసంధాన ప్రక్రియ అనేది నోటిఫైడ్ తేదీలో లేదా ముందుగా పూర్తి చేయాలి. లేని పక్షంలో ఆ పాన్ కార్డు పనిచేయదని ఐటీ శాఖ అధికారిక సర్క్యులర్‌లో పేర్కొంది.

పాన్ కార్డు పనిచేయకపోతే ఏమవుతుంది? :
ఐటీ నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. ఒక వ్యక్తి తమ ఆధార్ నంబర్‌ను లింక్ చేయడంలో విఫలమైతే.. వారి పాన్ కార్డు పనిచేయదని గమనించాలి. పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలు చేయడానికి, పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లను ప్రాసెస్ చేయడానికి, రీఫండ్‌లను జారీ చేయడానికి, పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్‌లను పూర్తి చేయడానికి లేదా సాధారణ రేటుతో పన్నులను మినహాయించడానికి వారి పాన్‌ను ఉపయోగించలేరు. ఇంకా, ఆర్థిక లావాదేవీలకు PAN ఒక ముఖ్యమైన (KYC)గా పనిచేస్తుంది. అందుకే, పన్ను చెల్లింపుదారు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ పోర్టల్‌లతో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

Read Also :  Apple iPhone 14 Sale : అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు..!

ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్‌తో ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేయడం ఎలా :
* (incometax.gov.in/iec/foportal/)లో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. ఆపేజీలో ఎడమ వైపున ఉన్న ‘Quick Links’ సెక్షన్ ఎంచుకోండి.
* ‘Quick Links’ సెక్షన్‌లో ‘Link Aadhaar Status’పై క్లిక్ చేయండి.
* మీ 10-అంకెల పాన్ నంబర్, 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని ప్రాంప్ట్ కనిపిస్తుంది. అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత, ‘View Link Aadhaar Status’పై క్లిక్ చేయండి.
* మీ ఆధార్ ఇప్పటికే మీ పాన్ కార్డ్‌తో లింక్ అయి ఉంటే.. మీ ఆధార్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Pan-Aadhaar linking deadline extended, here is what will happen after June 30

Pan-Aadhaar linking deadline extended, here is what will happen after June 30

SMS ద్వారా పాన్ కార్డ్‌తో ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేయడం ఎలా? :
ఈ కింది ఫార్మాట్‌లో 567678 లేదా 56161కి SMS పంపండి. అందులో ‘UIDPAN <12 అంకెల ఆధార్ నంబర్> <10 అంకెల పాన్ నంబర్> ఎంటర్ చేయాలి.
మీ పాన్ కార్డ్‌తో మీ ఆధార్ లింక్ చేయకపోతే.. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

పాన్ కార్డ్‌తో ఆధార్‌ను ఎలా లింక్ చేయాలంటే? :
* ఆర్థిక శాఖ (incometaxindiaefiling.gov.in/) ని విజిట్ చేయండి.
* ‘Quick Links’ కింద ‘Link Aadhaar’పై క్లిక్ చేయండి.
* మీ పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేయండి.
* మీ ఆధార్ వివరాలతో మీ పాన్ వివరాలను ధృవీకరించండి.
* మీ ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి, ‘Link Now’ క్లిక్ చేయండి.
* పాప్-అప్ మెసేజ్.. మీ ఆధార్‌ను పాన్‌తో విజయవంతంగా లింక్ అయినట్టే.

మీరు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి UTIITSL లేదా e-gov NSDL వెబ్‌సైట్‌లను కూడా విజిట్ చేయొచ్చు.

ఆధార్-పాన్ లింక్ పెనాల్టీ ఫీజు ఎంతంటే? :
ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ని ఆధార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య)తో లింక్ చేసేందుకు గడువు తేదీ మార్చి 31, 2022 వరకు ఉంది. అయితే, ప్రభుత్వం ఈ గడువును మార్చి 31, 2023 వరకు పొడిగించింది. అప్పుడు రూ. 1000 అపరాధ రుసుమును విధించింది. ఇప్పుడు, గడువు జూన్ 30కి పొడిగించింది. ఈ కొత్త గడువులోగా వ్యక్తులు తప్పనిసరిగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. లేదంటే.. రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్-పాన్ లింకింగ్ నుంచి ఎవరికి మినహాయింపు? :
ముఖ్యంగా, ఈ కింది వ్యక్తులు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేదు. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు. ఆదాయపు పన్ను చట్టంలో అందించిన డేటా ప్రకారం.. నాన్-రెసిడెంట్స్, భారతీయేతర పౌరులకు మినహాయింపు ఉంటుంది.

Read Also : Apple iPhone 11 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. కేవలం రూ. 8,950 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!