Akhil Akkineni – Ram Charan : అయ్యప్ప మాల వేసుకోమని రామ్ చరణ్ చెప్పాడు.. అది నాకు.. అఖిల్!

రామ్ చరణ్ తనని అయ్యప్ప మాల వేసుకోమని చెప్పినట్లు అఖిల్ చెప్పుకొచ్చాడు. కాగా అది తనకి..

Akhil Akkineni – Ram Charan : అయ్యప్ప మాల వేసుకోమని రామ్ చరణ్ చెప్పాడు.. అది నాకు.. అఖిల్!

Akhil Akkineni comments on Ram Charan ayyappa maala

Akhil Akkineni – Ram Charan : సినిమా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆధ్యాత్మికాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటాడు. దీక్షలో ఉంటూ, దైవ సేవ చేస్తూ నిత్యం దైవ చింతనే ఉంటాడు. దేశాలు దాటినా దైవ ఆరాధన మరువకుండా విదేశీలకు కూడా మన ఆధ్యాత్మికాన్ని పరిచయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆస్కార్ ప్రమోషన్స్ కి అమెరికా వెళ్లిన చరణ్.. అక్కడి వారికీ అయ్యప్ప మాల ప్రత్యేకత ఏంటనేది తెలియజేశాడు. దీక్ష అనేది కేవలం ఆద్యాత్మికం మాత్రమే కథను చెబుతూ దాని వెనుక ఉన్న సైంటిఫిక్ ఉపయోగాలు కూడా విదేశీలకు తెలియజేశాడు.

Ram Charan – Samantha : రామలక్ష్మికి చిట్టిబాబు ట్వీట్.. చాలా గర్వంగా ఉంది!

ఇక మన ధర్మాలను విదేశీలకు తెలియజేసేలా చేస్తున్న చరణ్ కి ఇండియాలో ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అయితే రీసెంట్ అక్కినేని అఖిల్ కూడా రామ్ చరణ్ అయ్యప్ప మాల గురించి మాట్లాడాడు. ఏజెంట్ (Agent) సినిమా ప్రమోషన్స్ లో ఉన్న అఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రొఫిషనల్ గా నేను ఏంటి? నేను ఏమి సాదించడానికి ట్రై చేస్తున్నాను? ఏమి సాదిస్తున్నాను? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అయోమయంలో పడిపోయిన సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాల వేయమని నాకు చెప్పాడు” అంటూ వెల్లడించాడు.

Agent : అఖిల్ కాదు మమ్ముట్టి హీరో.. రామ్ చరణ్ పాత్ర ఏంటి?

ఆ తరువాతే తాను మాల ధరించినట్లు. తను ప్రశ్నలకు కూడా సమాధానాలు కూడా దొరికాయని, రామ్ చరణ్ సలహా తనకి ఎంతో ఉపయోగపడింది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మరో ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో అఖిల్ కి తన స్ఫూర్తినించే స్టార్ ఎవరు అని ప్రశ్నించగా.. రామ్ చరణ్ అంటూ బదులిచ్చాడు. “రామ్ చరణ్ తనని ఒక బ్రదర్ లా, ఫ్రెండ్ లా చూసుకుంటూ, తనకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తూనే సలహాలు ఇస్తాడని” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజెన్లు చరణ్ అండ్ అఖిల్ మధ్య స్నేహం ఉందని తెలుసు గాని, మరి ఈ రేంజ్ లో ఉంటుందని అనుకోలా అంటూ కామెంట్ చేస్తున్నారు.