Agent : అఖిల్ కాదు మమ్ముట్టి హీరో.. రామ్ చరణ్ పాత్ర ఏంటి?

ఏజెంట్ సినిమా ఇవాళ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ పాత్ర కంటే మమ్ముట్టి రోల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందట. ఇక రామ్ చరణ్ పాత్ర..

Agent : అఖిల్ కాదు మమ్ముట్టి హీరో.. రామ్ చరణ్ పాత్ర ఏంటి?

Akkineni Akhil fans comments on Agent movie

Agent : అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నేడు (ఏప్రిల్ 28) ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథని అందించాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేశాడు. కొత్త హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Viadya) అఖిల్ కి జంటగా కనిపించింది. ఇక థియేటర్ లో ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తుంది. ముందు సినిమాల్లో పోలిస్తే ఏజెంట్ చిత్రంలో అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది అంటున్నారు.

Agent Twitter Review : మిక్స్‌డ్ టాక్.. ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. ఈ సారన్నా అయ్యగారు హిట్ కొడతారా?

ఈ చిత్రానికి తనవంతు న్యాయం చేశాడు అంటున్నారు. కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి అన్యాయం చేశాడంటూ కోపడుతున్నారు. ఒకప్పటి స్పై కథనే కాస్ట్‌లీగా చూపించే ప్రయత్నం చేశాడు అంటున్నారు. సినిమాలో అఖిల్ కంటే మమ్ముట్టిని బాగా చూపించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్స్ మీద నమ్మకంతో ఇలాంటి కథలు ఒకే చెప్పవద్దు అంటూ అఖిల్ ని కోరుతున్నారు. నాగార్జున కొడుకు సినిమా అంటే తమకి కొన్ని అంచనాలు ఉంటాయని, వాటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని కథల సెలెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Akhil Akkineni : నాన్న పై ఆధారపడడం ఇష్టం లేదు.. అన్నయ్య, నేను మాట్లాడుకుంటాం!

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ధృవ క్యారెక్టర్ తో ఇటీవల ఒక ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏజెంట్ అండ్ ధృవ క్యారెక్టర్స్ ని కలుపుతూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారేమో, ఏజెంట్ మూవీ రామ్ చరణ్ క్యామియో ఉంటుందేమో అనుకున్నారు. కానీ రామ్ చరణ్ ఎటువంటి గెస్ట్ రోల్ చేయలేదు. కేవలం ప్రమోషన్స్ మాత్రమే చేశాడు. ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో అక్కడ సినిమా బాగా రన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి టోటల్ రన్ లో ఎటువంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.