ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!

భార్య భర్తలుగా విడిపోయి.. వేర్వేరు మార్గాలలో ప్రయాణించబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు చై - సామ్..

ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!

Chay Samantha

Chay – Sam: సమంత – నాగ చైతన్య. మోస్ట్ క్యూట్ కపుల్ ఇన్ టాలీవుడ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి.. అనిపించేంతగా కలిసి నడిచారు. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలతోనూ.. టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచారు. ‘ఏ మాయ చేసావె’ సినిమాతో మొదలైన వారి ప్రేమ ప్రయాణం.. అక్కినేని ఫ్యామిలీ కాంబో ‘మనం’ సినిమాతో మరింత దగ్గర చేసింది. ‘ఆటో నగర్ సూర్య’ మూవీతో వారి జర్నీ మరింత క్లోజ్ అయ్యింది.

Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత

ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో మరో మలుపు తిరిగింది. ఈ జంట ఇప్పుడు నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇక నుంచి భార్య భర్తలుగా విడిపోయి.. వేర్వేరు మార్గాలలో ప్రయాణించబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు చై – సామ్.. గతకొద్ది రోజులుగా వీరిద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించలేదు.

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..

విడిపోబోతున్నారంటూ చాలా వార్తలు వచ్చాయి.. ఆ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం.. అది కూడా పెళ్లి రోజుకి సరిగ్గా నాలుగు రోజులు ముందుగా కావడంతో అక్కినేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2017 అక్టోబర్ 6న చై – సామ్ మ్యారేజ్ చేసుకున్నారు. అక్టోబర్ 6న హిందు, అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వెడ్డింగ్ గ్రాండ్‌‌గా జరిగింది.

Chai – Sam : అందరి కళ్లూ ఆ డేట్ మీదే.. ఎందుకలా..?