Jr NTR-Alia: అలియా పెళ్లి.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించిపోతూ దూసుకుపోతుంది. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా

Jr NTR-Alia: అలియా పెళ్లి.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

Jr Ntr Alia

Jr NTR-Alia: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించిపోతూ దూసుకుపోతుంది. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా ఇప్పుడు అలియా భట్ పేరే వినిపిస్తోంది. మన టాలీవుడ్ లో అలియాభట్ తమ హీరోయిన్ కావాలనే స్టార్ హీరోల లిస్ట్ పెరిగిపోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో గంగూభాయ్ కతియావాడితో ప్రేక్షకుల ముందుకొచ్చిన అలియా.. పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా పేరు దక్కించుకుంది.

Alia Bhatt Ranbir Kapoor Marriage: వెడ్డింగ్ డేట్ లాక్.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వేదిక ఫిక్స్?

ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ లో కూడా అలియా భట్ కావాలనే వారి సంఖ్య పెరిగిపోతుండగా.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వం ఎన్టీఆర్ నటించే రెండో సినిమా కోసం అలియాను ఫైనల్ చేశారు. అలియా ఇప్పటికే ఈ విషయాన్ని కూడా ప్రకటించగా.. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. అయితే.. ఇంతలోనే అలియా పెళ్లి చేసుకోబోతుందని టాక్ మొదలైంది. అతికొద్ది మంది సన్నిహితుల మధ్యన అలియా రణబీర్ కపూర్ ను డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతుందని బాలీవుడ్ కోడై కూస్తుంది.

Ram Charan-Jr NTR: ఆర్ఆర్ఆర్ సాలిడ్ కలెక్షన్స్.. నార్త్‌లో పెరిగిన తారక్-చెర్రీ రేంజ్!

అలియా పెళ్లిపై వస్తున్న వార్తల నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కొరటాల-ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకి వెళ్లడం చాలా ఆలస్యమైంది. ఈలోగా అలియా పెళ్లితో ఈ సినిమాకి కొత్త సమస్యలు వస్తాయా అనే టెన్షన్ కనిపిస్తుంది ఎన్టీఆర్ అభిమానులలో. ఒకవేళ పెళ్లి తరవాత అలియా ఈ సినిమా నుండి తప్పుకుంటే ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఎంపిక కారణంగా అయినా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందా అనే టెన్షన్ కూడా కనిపిస్తుంది.