Ram Charan-Jr NTR: ఆర్ఆర్ఆర్ సాలిడ్ కలెక్షన్స్.. నార్త్‌లో పెరిగిన తారక్-చెర్రీ రేంజ్!

సాలిడ్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీకెండ్ అదుర్స్ అనిపించుకుంది ట్రిపుల్ ఆర్. బాలీవుడ్ లో 5 డేస్ లోనే 107 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, షార్ట్ పీరియడ్ లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.

Ram Charan-Jr NTR: ఆర్ఆర్ఆర్ సాలిడ్ కలెక్షన్స్.. నార్త్‌లో పెరిగిన తారక్-చెర్రీ రేంజ్!

Ram Charan-Jr NTR

Updated On : March 31, 2022 / 10:56 AM IST

Ram Charan-Jr NTR: సాలిడ్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీకెండ్ అదుర్స్ అనిపించుకుంది ట్రిపుల్ ఆర్. బాలీవుడ్ లో 5 డేస్ లోనే 107 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, షార్ట్ పీరియడ్ లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది ఆర్ఆర్ఆర్. విజువల్ వండర్ గా ఆడియన్స్ కు ట్రీట్ ఇస్తున్న ఈ సినిమాతో తారక్, చరణ్ లకు వస్తున్న ప్రశంసలు తక్కువేమీ కాదు. బాలీవుడ్ లో జంజీర్ సినిమా చూసి ట్రోలింగ్ చేసిన వాళ్లే ట్రిపుల్ ఆర్ లో చరణ్ పెర్ఫామెన్స్ ను తెగ పొగిడేస్తున్నారు. ఫస్ట్ టైమ్ తారక్ ను చూసిన నార్త్ ఆడియన్స్ ఆయన నటనకు ఫిదా అవుతున్నారు.

RRR: ఆర్ఆర్ఆర్ మేనియా.. జక్కన్నపై కంగనా పొగడ్తల వర్షం!

రాజమౌళి మార్క్ డైరెక్షన్.. చరణ్, తారక్ స్క్రీన్ ప్రజెంటేషన్ ఫాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. రామ్ చరణ్ చేసిన రామరాజు క్యారెక్టర్ కు బాలీవుడ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు గురించి తెలియని అక్కడి ఆడియన్స్ కొందరైతే లార్డ్ రామాగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడని రామ్ చరణ్ ను పొగిడేస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ కామెంట్స్ తో రివ్యూస్ ఇస్తుంటే, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా చరణ్ యాక్షన్ ను మెచ్చేసుకుంటున్నారు.

RRR: నేపాల్‌లో దుమ్ములేపుతున్న ఆర్ఆర్ఆర్!

రామ్ చరణ్ 2013లోనే జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో భయంకరమైన ట్రోల్స్ ను ఫేస్ చేశాడు. అప్పుడు చరణ్ ఫేస్ దగ్గర నుంచి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ వరకూ ప్రతిదానిపై కొందరు కామెంట్ చేశారు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అదే బాలీవుడ్ ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకున్నాడు చరణ్. అందుకే డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలు చేయడానికి అక్కడి డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారు. ఏ డైరెక్టర్ తో చరణ్ సినిమా పట్టాలెక్కుతుందో చూడాలి. ప్రస్తుతం చరణ్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఆచార్య, శంకర్ మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరితో చేయబోయే సినిమా ఉంది.

RRR: తగ్గని జోరు.. హిందీలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆర్ఆర్ఆర్!

కొమురం భీమ్ క్యారెక్టర్ లో తారక్ నట విశ్వరూపం చూసిన బాలీవుడ్ ఆడియన్స్ వహ్హా అంటున్నారు. ఆర్ఆర్ఆర్ కు ముందు తారక్ చేసిన సినిమాలపైన ఇప్పుడు సెర్ఛింగ్ మొదలు పెట్టారు. బాలీవుడ్ క్రిటిక్స్ ఎన్టీఆర్ నటనకి నేషనల్ అవార్డ్ ఇవ్వొచ్చని కామెంట్స్ చేశారు. ఇక నార్త్ స్టార్స్ కూడా ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ కు వస్తోన్న రెస్పాన్స్ తో ఎన్టీఆర్ ఫుల్ హాపీగా ఉన్నారు. ఆమధ్య ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో తారక్ బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరాణి లాంటి డైరెక్టర్స్ తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఉన్నట్టు ఇంట్రెస్ట్ చూపించారు. సో ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ మార్కెట్ బాలీవుడ్ లోనూ పెరగడంతో ఏ డైరెక్టర్, తారక్ తో సినిమా చేస్తాడో అని క్యూరియస్ గా చూస్తున్నారు ఆయన ఫాన్స్.