RRR: నేపాల్‌లో దుమ్ములేపుతున్న ఆర్ఆర్ఆర్!

‘బాహుబలి’ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను పలుమార్లు వాయిదా....

RRR: నేపాల్‌లో దుమ్ములేపుతున్న ఆర్ఆర్ఆర్!

Rrr Solid Collections At Nepal Box Office

RRR: ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చి, ఎట్టకేలకు మార్చి 25న రిలీజ్ చేయడంతో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా థియేటర్లకు వెళ్లారు. ఇక ఈ సినిమాకు అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ చిత్రం వసూళ్ల పరంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కాగా ఈ సినిమాకు ఇతర దేశాల్లోనూ ఇదే తరహా కలెక్షన్లు వస్తుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది.

RRR: బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ నెంబర్ ఆరు!

ముఖ్యంగా ఎవరూ ఊహించని దేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్ పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా ఆర్ఆర్ఆర్ తన ప్రతాపం చూపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ రోజు నుండే అక్కడ మంచి కలెక్షన్లు రాబడూ వస్తోంది. అయితే ఫస్ట్ వీకెండ్ తరువాత ఈ వసూళ్ల జోరు తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ నేపాల్ బాక్సాఫీస్ వద్ద మంగళవారం నాడు కూడా అదే స్థాయిలో వసూళ్లు రావడంతో అక్కడి చిత్ర వర్గాలు అవాక్కవుతున్నాయి.

RRR: తగ్గని జోరు.. హిందీలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆర్ఆర్ఆర్!

రోజుకు రూ.కోటి చొప్పున నేపాల్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.4 కోట్ల కలెక్షన్లు ఆర్ఆర్ఆర్ చిత్రం రాబట్టింది. ఇలాగే కొనసాగితే ఈ సినిమా తొలి వారం పూర్తయ్యే సరికి రూ.7 కోట్ల మేర వసూళ్ల రాబట్టడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు అక్కడి జనం కూడా నీరాజనాలు పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో నేపాల్ లాంటి మరిన్ని దేశాల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు అక్కడి సినీ విశ్లేషకులు.