Suriya Fans: రీ-క్రియేషన్ పిచ్చి.. కళ్ళకు గంతలు కట్టుకుని కత్తితో.. కరుప్పు థియేటర్స్ వద్ద సూర్య ఫ్యాన్స్ రచ్చ
కరుప్పు థియేటర్స్ వద్ద కత్తితో హల్చల్ చేసిన సూర్య ఫాన్స్(Suriya Fans).
Suriya fans create ruckus with a knife outside Karuppu movie theaters
- సూర్య సినిమా క్రేజ్ పీక్స్.
- కత్తితో అభిమానుల ప్రమాదకర స్టంట్లు.
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
Suriya Fans: సినిమా హీరోల మీద అభిమానం చూపించడం అనేది ఒక ఎత్తు అయితే, అది వెర్రితనంలా మారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మరొక ఎత్తు. ఒకప్పుడు కేవలం థియేటర్ల వద్ద కటౌట్లకు పాలాభిషేకాలు, పూలదండలు వేసేవారు. కానీ నేడు సోషల్ మీడియా ప్రభావంతో హీరోల ఫ్యాన్స్ సరికొత్త పోకడలకు వెళ్తున్నారు. తాము ఇష్టపడే హీరోలు స్క్రీన్ మీద చేసే సాహసకృత్యాలను నిజ జీవితంలోనూ చేసి, వాటిని వీడియోలు తీసి వైరల్ చేయాలనే తాపత్రయం ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది.
Ananya Nagalla: నాగశౌర్య నా ఫస్ట్ క్రష్.. మనసులో మాట చెప్పిన అనన్య నాగళ్ళ.. కాబోయే వాడు అలాగే ఉండాలట
తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya Fans) నటించిన ‘కరుప్పు’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసిన ఒక విన్యాసం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. సినిమాలో హీరో చేసే ఒక రిస్కీ ఫైట్ సీన్‌ను రీ-క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కొందరు యువకులు కత్తితో ప్రమాదకరమైన ఫీట్ చేశారు. ఒక యువకుడు కళ్ళకు గంతలు కట్టుకుని, కింద పడుకున్న మరో వ్యక్తి పొట్టపై ఉన్న ఒక ముల్లంగిని కత్తితో రెండు ముక్కలు చేశాడు.
ఒకవేళ గురి తప్పి కత్తి పొట్టకు తగిలి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆలోచిస్తేనే భయం కలుగుతోంది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమేనని, అందులో చేసే విన్యాసాలన్నీ నిపుణుల సమక్షంలో గ్రాఫిక్స్ సహాయంతో చేస్తారని అభిమానులు గుర్తించడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల ప్రాణాలు పోవడమే కాకుండా, సదరు హీరోల పేరు కూడా చెడిపోయే అవకాశం ఉంది. వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#Karuppu Celebration 😬 https://t.co/QQcrFDBGXd
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) May 15, 2026
