RRR: తగ్గని జోరు.. హిందీలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆర్ఆర్ఆర్!

టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల..

RRR: తగ్గని జోరు.. హిందీలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆర్ఆర్ఆర్!

Rrr To Stream Earlier Than Expected In Ott

RRR: టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబో ఈ సినిమాకు మేజర్ బలం కావడంతో సినిమా చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. కొంత మిక్సెడ్ టాక్ వచ్చినా హీరోల యాక్టింగ్, విజువల్ వండర్ అనే టాక్ సినిమాకి అసెట్ గా మారుతుంది.

RRR: పుష్ప దారిలోనే ఆర్ఆర్ఆర్.. సౌత్‌లో ముందే ఓటీటీ రిలీజ్?

తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టినా సోమవారం నుండి కలెక్షన్లు ఎలా ఉంటాయోనని కాస్త టెన్షన్ పడినా నో డౌట్ తగ్గేదేలే అంటూ బాక్సాపీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తుంది. సౌత్ తో పోలిస్తే నార్త్ లో ఓపెనింగ్స్, ప్రీ బుకింగ్ రాలేదని టాక్ వచ్చినా మెల్లగా నార్త్ లో కూడా భారీ కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఆర్ఆర్ఆర్ తాజాగా బాలీవుడ్ లో కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి మరోసారి టాలీవుడ్ మేనియా కొనసాగించింది. అంతేకాదు, చాలా ఏరియాల్లోనూ ఆల్‌టైం రికార్డులు క్రియేట్ చేసింది.

RRR: ఫస్ట్ వీక్ దద్దరిల్లిన బాక్సాపీస్.. రాజమౌళికి మొదలైంది అసలు పరీక్ష!

ఆర్ఆర్ఆర్ తొలి 5 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఫలితంగా నైజాంలో రూ.68.35 కోట్లు, సీడెడ్‌లో రూ.34.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.32 కోట్లు, ఈస్ట్‌లో రూ.10.41 కోట్లు, వెస్ట్‌లో రూ.9.17 కోట్లు, గుంటూరులో రూ.13.32 కోట్లు, కృష్ణాలో రూ.10 కోట్లు, నెల్లూరులో రూ.5.88 కోట్లతో కలుపుకుని రూ.170.63 కోట్లు షేర్, రూ.253.10 కోట్లు గ్రాస్ వచ్చింది. 5 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలో రూ.170.63 కోట్లు షేర్ వచ్చింది.

RRR Collections :  మూడు రోజుల్లో 500 కోట్లు.. అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్

అలాగే, కర్నాటకలో రూ.24.85 కోట్లు, తమిళనాడులో రూ.21.18 కోట్లు, కేరళలో రూ.5.35 కోట్లు, హిందీలో రూ. 53.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.67.60 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ. 348.18 కోట్లు షేర్‌, రూ.625 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. వీకెండ్ లో నార్త్ టాప్ లో ఉన్న కాశ్మీర్ ఫైల్స్ ను కిందికి నెట్టి వసూళ్లలో ఆర్ఆర్ఆర్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. లాంగ్ రన్ లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.