RRR: ఫస్ట్ వీక్ దద్దరిల్లిన బాక్సాపీస్.. రాజమౌళికి మొదలైంది అసలు పరీక్ష!

బ్లాక్ బస్టర్-యావరేజ్.. హీరోలు సూపర్బ్-డైరెక్టర్ మార్క్ మిస్.. ఇలా మిక్స్ డ్ టాక్ తో ట్రిపుల్ ఆర్ మేనియా మొదలైనా.. సాలిడ్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీకెండ్ మాత్రం అదుర్స్ అనిపించుకుంది.

RRR: ఫస్ట్ వీక్ దద్దరిల్లిన బాక్సాపీస్.. రాజమౌళికి మొదలైంది అసలు పరీక్ష!

Rrr 11zon 1 1

RRR: బ్లాక్ బస్టర్-యావరేజ్.. హీరోలు సూపర్బ్-డైరెక్టర్ మార్క్ మిస్.. ఇలా మిక్స్ డ్ టాక్ తో ట్రిపుల్ ఆర్ మేనియా మొదలైనా.. సాలిడ్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీకెండ్ మాత్రం అదుర్స్ అనిపించుకుంది. ఇక ఇప్పుడుంది అసలు పరీక్ష. ఈ వీక్ మొత్తం ఎలా నడుస్తుందన్న మ్యాటర్ పైనే జక్కన్న లెక్కలు తేలిపోనున్నాయి.

RRR : సినిమా అర్దమవ్వట్లేదు.. సబ్ టైటిల్స్ కావాలి.. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి ఆడియన్స్ విజ్ఞప్తి..

500 కోట్లతో రిలీజ్ వీకెండ్ ను సాలిడ్ గా పూర్తి చేసింది ట్రిపుల్ ఆర్. వెయ్యి కోట్ల బిజినెస్ చేసి బరిలోకి దూకిన ఈ మూవీ.. మూడు రోజుల్లోనే అందులో సగం రాబట్టింది. ఫ్రైడే టు సండే కలెక్షన్స్ కలుపుకొని నైజాం ఏరియాలో 53 కోట్లకు పైగా రాబట్టిన జక్కన్న సినిమా.. సీడెడ్ ప్రాంతంలో 30 కోట్లను క్రాస్ చేసింది. మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ థియేటర్స్ నుంచి 204 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఆర్ఆర్ఆర్ 140 కోట్లకు మించిన షేర్ సాధించింది.

RRR : రాజమౌళి బంగారం అంటూ పొగడ్తల వర్షం.. ‘ఆర్ఆర్ఆర్’పై ఆర్జీవీ వాయిస్..

19 కోట్లతో కర్ణాటక, 17 కోట్లతో తమిళనాడు, ఐదున్నర కోట్లతో కేరళ.. ఇలా ఫస్ట్ 3 డేస్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ట్రిపుల్ ఆర్.. క్రేజీగా హిందీ మార్కెట్ లో 37 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సంపాదించింది. అటు ఓవర్సీస్ లో నెవర్ బిఫోర్ రికార్డ్ కొట్టేసి ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న హాలీవుడ్ మూవీస్ ను కూడా దాటేసి.. 57 కోట్లను రీచయింది. ఈ వీకెండ్ కలెక్షన్స్ చూసి హాలీవుడ్ మీడియాలో కూడా ట్రిపుల్ ఆర్ కథనాలొస్తున్నాయంటే ఏ రేంజ్ లో సినిమా ఊపెస్తుందో అర్ధమవుతోంది.

RRR: జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్?

మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ 500 కోట్లను క్రాస్ చేసి.. గట్టెక్కింది ట్రిపుల్ ఆర్. కానీ రాజమౌళికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఈ వారం మళ్లీ వీకెండ్ క్లోజ్ అయ్యే లోపు ఇంతకుమించిన కలెక్షన్స్ రాబడితేనే జక్కన్న వ్యూహం ఫలిస్తుంది. లేదంటే నాన్ బాహుబలి2 రికార్డ్ మళ్లీ టాప్ లోనే కొనసాగుతుంది. మొదటి వారంలో ఫ్యాన్స్ హడావిడే ఎక్కడైనా కనిపిస్తుంది. టాప్ లీగ్ లో వసూళ్లు రాబట్టాలంటే ఇప్పటినుంచి కామన్ ఆడియెన్స్ థియేటర్స్ కి రావాలి. అటు చూస్తే స్టూడెంట్స్ ఎగ్జామ్స్, క్రికెట్ మ్యాచెస్ ఎఫెక్ట్ ట్రిపుల్ ఆర్ పై పడే ఛాన్స్ ఉంది. మరి వీటన్నింటిని అధిగమించి జక్కన్న 2 వేల కోట్ల లక్ష్యం చేరుకుంటారా అన్నది చూడాలి.