RRR: జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్?

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.....

RRR: జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్?

Alia Bhatt Not Happy With Rrr

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ హీరోను ఎక్కువగా చూపించారని.. మరో హీరోను తక్కువగా చూపించారని అభిమానులు కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Alia Bhatt: అలియా నామస్మరణ.. ఏవుడ్‌లో చూసినా భట్ బేబీ పేరే!

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో ఆలియా భట్ నటనకు మంచి మార్కులే వేశారు ఆడియెన్స్. అయితే ఈ సినిమా ఔట్‌పుట్‌తో ఆలియా హ్యాపీగా లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన స్క్రీన్ ప్రెజెన్స్ అనుకున్న స్థాయిలో లేదని ఆమె ఫీల్ అవుతుందట. అందుకే గతకొద్ది రోజులుగా ఆమె ఆర్ఆర్ఆర్ గురించి ఎలాంటి పోస్టులు కూడా పెట్టడం లేదని వార్తలు వస్తున్నాయి. అంతేగాక సినిమా సక్సెస్ పార్టీలో కూడా ఆలియా కనిపించలేదు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ పార్టీ

కాగా తాజాగా ఆమె సోషల్ మీడియాలో దర్శకుడు రాజమౌళిని అన్‌ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు జక్కన్న-ఆలియా భట్‌ల మధ్య విభేదాలు వచ్చాయనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆలియా నోరు విప్పాల్సిందే అంటున్నారు సినీ విమర్శకులు. ఏదేమైనా ఈ వార్తతో మరోసారి ఆలియా భట్ వార్తల్లో నిలిచిందని చెప్పాలి.