Alia Bhatt: అలియా నామస్మరణ.. ఏవుడ్‌లో చూసినా భట్ బేబీ పేరే!

బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అయినా.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించిపోతోంది ఆలియా. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా అలియా భట్ పేరే..

Alia Bhatt: అలియా నామస్మరణ.. ఏవుడ్‌లో చూసినా భట్ బేబీ పేరే!

Alia Bhatt

Alia Bhatt: బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అయినా.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించిపోతోంది ఆలియా. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా అలియా భట్ పేరే వినిపిస్తోంది. మన టాలీవుడ్ లో అలియాభట్ తమ హీరోయిన్ కావాలనే స్టార్ హీరోల లిస్ట్ పెరిగిపోతోంది.

Alia Bhatt : హాలీవుడ్‌లోకి అలియా ఎంట్రీ..

సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియా డిఫరెంట్ మూవీ స్ చేస్తూనే కెరీర్ లో ఫుల్ బిజీ అవుతోంది. లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ కారణంగా సినిమాలకు బ్రేక్ పడినా, 2022లో మాత్రం పక్కా ప్లానింగ్ తో ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన తన మూవీ గంగూభాయ్ కతియావాడి 10 డేస్ లోనే 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, ఆలియా భట్ మార్కెట్ రేంజ్ పెంచేసింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అమ్మడి క్రేజ్ పెరిగిపోవడంతో.. వరసగా టాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయిపోయింది ఆలియాభట్.

Alia Bhatt: సిల్వర్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న అలియా!

గంగూభాయ్ కతియా వాడి రిలీజ్ అయ్యిందో లేదో.. మరో బిగ్ మూవీ లైనప్ లో రిలీజ్ కు రెడీగా ఉంది. ప్యాన్ ఇండియా లెవల్లో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ ఈనెల 25న లార్జ్ స్కేల్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆలియా భట్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో ఆమె మార్కెట్ స్పాన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. రాజమౌళి సినిమాలో ఏ రోల్ అయినా చెయ్యడానికి రెడీగా ఉన్నానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో లేటెస్ట్ గా రాజమౌళి.. మహేష్ తో చెయ్యబోయే సినిమాలో ఆలియానే హీరోయిన్ గా చేస్తోందంటూ న్యూస్ వినిపిస్తోంది.

Alia Bhatt: ఫాఫమ్ అలియా.. పగలబడి నవ్వినా తప్పేనా?!

చరణ్, మహేష్ సినిమాలతో పాటు ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమాకి కూడా కమిట్ అయ్యింది ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్టు ఆలియా తనే స్వయంగా అనౌన్స్ చేసింది. ఇంకా విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ తో నటించాలనుందని తన కోరికను బయటపెట్టింది. సో ఇప్పుడో అప్పుడో బన్నీతోనో, రౌడీ బాయ్ తోనో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందని, ఈ క్రేజీ కాంబినేషన్స్ ని తెరమీద చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.