Alia Bhatt : హాలీవుడ్‌లోకి అలియా ఎంట్రీ..

ఇటీవలే 'గంగూబాయి కతియావాడి' సినిమాతో ప్రేక్షకులని పలకరించిన అలియా భట్ త్వరలోనే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, వండర్ వుమెన్, రెడ్ నోటిస్ లాంటి సినిమాలతో.....

Alia Bhatt : హాలీవుడ్‌లోకి అలియా ఎంట్రీ..

Alia Bhatt(Image:Instagram)

Alia Bhatt :  మన హీరోయిన్స్ అంతా బాలీవుడ్ టార్గెట్ పెట్టుకుంటే బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం హాలీవుడ్ ని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ హాలీవుడ్ సినిమాల్లో మెరిశారు. ప్రియాంక చోప్రా అయితే హాలీవుడ్ లోనే ఫిక్స్ అయిపోయి అక్కడే వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ కూడా హాలీవుడ్ కి చెక్కేయడానికి రెడీ అయింది.

 

ఇటీవలే ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన అలియా భట్ త్వరలోనే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, వండర్ వుమెన్, రెడ్ నోటిస్ లాంటి సినిమాలతో హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన హీరోయిన్ గాల్ గ్యాడ‌ట్‌తో కలిసి అలియా నటించనుంది. గాల్ గ్యాడెట్, ఆమె భ‌ర్త జేర‌న్ వార్స‌నో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ కోసం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో అలియా కూడా ఓ ముఖ్య పాత్ర పోషించనుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ఒక థ్రిల్ల‌ర్‌ కథతో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో గాల్ గ్యాడ‌ట్‌తో కలిసి అలియా స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది.

Poonam Kaur : మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..

దీంతో అలియా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే అలియాకు కూడా వరుస హాలీవుడ్ ఛాన్సులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.