Poonam Kaur : మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..

ప్రమోషన్స్ లో భాగంగా పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మాట్లాడుతూ.. ''చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. సినిమాలు.....

Poonam Kaur : మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..

Punam Kaur

 

Poonam Kaur :  ‘మాయాజాలం’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన హీరోయిన్ పూనమ్‌ కౌర్‌. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసింది. 2018లో చివరి సారిగా తెలుగు సినిమాల్లో కనిపించింది. నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటోంది. చాలా గ్యాప్‌ తర్వాత పూనమ్‌ మెయిన్ లీడ్ లో ఒక సినిమా రాబోతుంది. అరవింద్‌ కృష్ణ హీరోగా పూనమ్ కౌర్ హీరోయిన్ గా ‘నాతి చరామి’ అనే సినిమా రాబోతుంది. నాగు గవర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహించారు.

 

ఈ ప్రమోషన్స్ లో భాగంగా పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మాట్లాడుతూ.. ”చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నాను. 2017, 18లోనే నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నా. కానీ నా జీవితాన్ని మార్చేసింది సినిమానే. తర్వాత ఇక సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్‌ వెళ్లిపోతానని అనుకున్నాను, ఇదే ఇంట్లో వాళ్లకి కూడా చెప్పాను. కానీ చాలా బాధపడిన తర్వాత రియలైజ్‌ అయ్యాను. ప్రతిరోజూ సీత, దుర్గా, ద్రౌపదిలానే తలచుకునేదాన్ని. అందువల్లే చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను.”

Krishnam Raju : కృష్ణంరాజుకి సర్జరీ.. కాలి వేలుని తొలిగించిన వైద్యులు..

”నా లాంటి మధ్య తరగతి అమ్మాయిలకు చాలా కలలుంటాయి. అందులో ప్రత్యేకమైనది పెళ్లి. ఆ పెళ్లి కలను కొందరు చెదరగొట్టారు. కానీ ఇండియన్‌ కల్చర్‌లోనే మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనేది, పోరాడలనేది ఉంది. దాన్నుంచే నేను స్ఫూర్తి పొందాను. ఈ విషయంలో మా అమ్మ ఎంతో సపోర్ట్‌ చేసింది. ఇలా బాధపడుతున్న టైంలోనే మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా ఒకటి ఉందని నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. భార్య గురించి చెప్పే కథ అని తెలిసాక ఈ సినిమా ఒప్పుకున్నాను. ‘నాతి చరామి’ సినిమాలో శ్రీలత పాత్ర చాలా మంది మహిళల జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది” అని తెలిపింది.