Alia Bhatt: ఫాఫమ్ అలియా.. పగలబడి నవ్వినా తప్పేనా?!

సోషల్ మీడియా అంటే అదో మాయ ప్రపంచం. అందులో చిక్కుకున్న వారు బానిసలవడమే కాదు.. ప్రపంచంలో ఎవరేం చేసినా దాని మీద విశ్లేషణ చేసి తామేదో ఉద్దరించామని అనుకుంటారు. ముఖ్యం సినీ సెలబ్రిటీల..

Alia Bhatt: ఫాఫమ్ అలియా.. పగలబడి నవ్వినా తప్పేనా?!

Alia Bhatt

Updated On : January 3, 2022 / 5:45 PM IST

Alia Bhatt: సోషల్ మీడియా అంటే అదో మాయ ప్రపంచం. అందులో చిక్కుకున్న వారు బానిసలవడమే కాదు.. ప్రపంచంలో ఎవరేం చేసినా దాని మీద విశ్లేషణ చేసి తామేదో ఉద్దరించామని అనుకుంటారు. ముఖ్యం సినీ సెలబ్రిటీల విషయంలో అయితే ఇది మరీ ఘోరంగా ఉంటుంది. డ్రెస్సులు, చెప్పులు, ధరించే వాచ్, హ్యాండ్ బ్యాగ్ కూడా ఎలా ఉండాలో ఈ సోషల్ మీడియాలో నెటిజన్లే చెప్పేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీలు ఎలా ఉన్నా ఈ రోజుల్లో ట్రోలింగ్స్ తప్పేలా కనిపించడం లేదు.

Nidhhi Agerwal: దాచినా దాగని అందాల నిధి

ఇప్పుడు అలియానే తీసుకోండి. ఓ ఈవెంట్ కు హాజరైన అలియాను ఫోటో గ్రాఫర్లు పోజులివ్వమన్నారు. దానికి అలియా నవ్వుతూనే స్టిల్స్ ఇచ్చింది. ఆ నవ్వు చాలదు ఇంకా కావాలని ఫోటోగ్రాఫర్లు అడిగారు. దానికి అలియా పగలబడి నవ్వింది. ఫాఫామ్ అదే పాపమైంది. ఈ వీడియో కాస్త ఫోటోగ్రాఫర్ వైరల్‌ భయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు అలియా నవ్వు ఫేక్ అంటూ ఏకిపారేస్తున్నారు.

Ashu Reddy: డ్రెస్ ఏదైనా అషూ అంటే అందాల జాతరే!

వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఆమెది ఫేక్‌ నవ్వని ట్రోలింగ్‌ చేస్తున్నారు. అసలు ఆమె చిరునవ్వు చిందించడానికి ఎందుకు అంత బాధపడుతుందో తెలియట్లేదు అని కామెంట్ల్‌ పెడుతున్నారు. ఇంతకుముందు దీపికా పదుకొణె కూడా అలానే ఫోటో సెషన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇలానే ఫేక్ నవ్వు అని ట్రోల్ అయింది. అప్పుడు దీపికా వీడియోలో కూడా ఫేక్ నవ్వు అని అలియా కామెంట్ చేయడం విశేషం కాగా ఇప్పుడు నెటిజన్లు ఆ కామెంట్ ను గుర్తు చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)