RRR : సినిమా అర్దమవ్వట్లేదు.. సబ్ టైటిల్స్ కావాలి.. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి ఆడియన్స్ విజ్ఞప్తి..

ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్ నుంచే ఓ కంప్లైంట్ వస్తుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో బ్రిటిష్ వాళ్ళు ఉండే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈ సన్నివేశాల్లో వాళ్ళు ఇంగ్లీష్ లోనే.......

RRR : సినిమా అర్దమవ్వట్లేదు.. సబ్ టైటిల్స్ కావాలి.. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి ఆడియన్స్ విజ్ఞప్తి..

Rrr

RRR :  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే నాలుగు రోజులు అయింది. సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్ నుంచే ఓ కంప్లైంట్ వస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బ్రిటిష్ వాళ్ళు ఉండే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈ సన్నివేశాల్లో వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో ఇలా వేరే లాంగ్వేజ్ ఉంటే వాటికి కింద తెలుగు సబ్ టైటిల్స్ ఇస్తారు. లేదా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వారి వాయిస్ ని మ్యూట్ చేసి వెనకాల వేరే వాయిస్ తో డైలాగ్ తెలుగులో చెప్తారు.

అయితే ‘ఆర్ఆర్ఆర్’లో మాత్రం ఇలాంటివేమీ లేవు. కథ ప్రకారం సినిమాలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. దాదాపు సినిమా మొత్తం మీద 15 నిమిషాలకు పైగానే ఇంగ్లీష్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే ఇవి గ్రామాల్లో ఉండే ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి అర్ధం అవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. కథ ప్రకారం అక్కడ జరిగేది ఏమిటో మాకు అర్థం కావాలి కదా అంటూ కొంతమంది అడుగుతున్నారు.

RRR : రాజమౌళి బంగారం అంటూ పొగడ్తల వర్షం.. ‘ఆర్ఆర్ఆర్’పై ఆర్జీవీ వాయిస్..

చిన్న చిన్న ఊర్లలో సినిమా చూసే ప్రేక్షకులు సినిమాలో ఉన్న ఇంగ్లీష్ అర్థం కావడం లేదు, వాటికి కనీసం సబ్ టైటిల్స్ అయినా ఉండాలి అంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. వీరి కంప్లైంట్స్ సినిమా టీం వరకు వెళ్లాయంట. మరి దీనిపై ‘ఆర్ఆర్ఆర్’ టీం దృష్టి సారిస్తుందేమో చూడాలి. సినిమాలో సబ్ టైటిల్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారా లేక కలెక్షన్స్ వస్తున్నాయి కదా అంటూ అలాగే వదిలేస్తారో చూడాలి.