RRR: పుష్ప దారిలోనే ఆర్ఆర్ఆర్.. సౌత్‌లో ముందే ఓటీటీ రిలీజ్?

గత శుక్రవారం మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చేసింది భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. మూడేళ్ళ నుండి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. ఆ అంచనాలకు తగ్గట్లే..

RRR: పుష్ప దారిలోనే ఆర్ఆర్ఆర్.. సౌత్‌లో ముందే ఓటీటీ రిలీజ్?

Rrr To Stream Earlier Than Expected In Ott

RRR: గత శుక్రవారం మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చేసింది భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. మూడేళ్ళ నుండి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. ఆ అంచనాలకు తగ్గట్లే ఇప్పుడు ఆల్ ఓవర్ గా కలెక్షన్లను కొల్లగొట్టడంతో జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ పడ్డట్లే కనిపిస్తుంది. ఇప్పటికే తొలి మూడు రోజులలోనే రూ.500 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది ఆర్ఆర్ఆర్. ఇక ఆ తర్వాత ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

RRR: ఫస్ట్ వీక్ దద్దరిల్లిన బాక్సాపీస్.. రాజమౌళికి మొదలైంది అసలు పరీక్ష!

ఇదిలా ఉండగానే ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ అంశంలో కూడా క్లారిటీ వచ్చేసినట్లు ఓ ప్రచారం మొదలైంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదలయ్యే అవకాశం ఉందని వినిపించింది. ఇప్పుడు వాటికే డిజిటల్ రైట్స్ దక్కినట్లు తెలుస్తుంది. సౌత్‌ లాంగ్వేజెస్‌ వరకు జీ5లో స్ట్రీమింగ్‌ కాబోతుంటే, హిందీతోపాటు ఇతర భాషలైన ఇంగ్లీష్‌, పోర్చుగల్‌, కొరియన్‌, టర్కీష్‌, స్పానిష్‌ భాషలు నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇక, సినిమా విడుదలయ్యాక 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనే కండీషన్‌ కూడా పెట్టుకున్నట్టు ఇప్పటి వరకు కథనాలొచ్చాయి.

RRR : రాజమౌళి బంగారం అంటూ పొగడ్తల వర్షం.. ‘ఆర్ఆర్ఆర్’పై ఆర్జీవీ వాయిస్..

అయితే.. 90 రోజుల కంటే ముందే ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి వచ్చేయనుందని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌ను 2 నెలల్లోనే ఓటీటీకి తీసుకొచ్చే ప్లాన్‌ చేస్తున్నారట. మే 25వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేసేందుకు జీ5 ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఇక హిందీ వెర్షన్‌ మాత్రం నెటిఫ్లిక్స్‌లో 3 నెలల తర్వాత అంటే జూన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తోంది. గతంలో పుష్ప సినిమాను కూడా సౌత్ లో ముందే రిలీజ్ చేసి ఆ తర్వాత హిందీలో స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అదే దారిలో ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాల్సి ఉంది.