SBI FD Scheme : SBIలో FD చేస్తున్నారా? రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే.. లక్షన్నరపైగా భారీ వడ్డీ.. పూర్తి లెక్కలివే
SBI FD Scheme : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను అందిస్తోంది. మీరు ఈ బ్యాంకులో కేవలం 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. పూర్తి వివరాలివే..
SBI Scheme ( Image Credit : AI )
- ఎస్బీఐ కస్టమర్ల కోసం అద్భుతమైన FD వడ్డీ రేట్లు ఇవే
- 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు
- కనిష్టంగా 3.05 శాతం నుంచి గరిష్టంగా 7.15 శాతం వరకు వడ్డీ రేట్లు
SBI FD Scheme : ఎస్బీఐలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంకులో కేవలం 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్లను ఓపెన్ చేయొచ్చు.
వివిధ ఎఫ్డీ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా హామీతో (SBI Scheme) రాబడి పొందవచ్చు. ఒక వ్యక్తి ఏదైనా (SBI FD Scheme) నిర్దిష్ట ఎస్బీఐ ఎఫ్డీ పథకంలో రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 1,58,974 వరకు స్థిర వడ్డీని పొందవచ్చు. అందుకే సురక్షితమైన పెట్టుబడులు హామీతో ఆదాయం కోరుకునే వారికి ఎస్బీఐ ఎఫ్డీలు మంచి రాబడిని అందిస్తాయి.
FDపై ఎస్బీఐ ఎంత వడ్డీ ఇస్తోంది? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ వినియోగదారులకు ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)పై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంకు వివిధ కాలపరిమితుల FD పథకాలపై కనిష్టంగా 3.05 శాతం నుంచి గరిష్టంగా 7.15 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఎస్బీఐ అతి తక్కువ కాలపరిమితితో 7-రోజుల FD, వినియోగదారులకు 3.05 శాతం నుంచి 3.65 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
Read Also : Vivo Y400 Price : వివో లవర్స్ మీకోసమే.. ఈ వివో Y400పై రూ. 12వేలు డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?
46 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితితో FDలు 4.90 శాతం నుంచి 5.50 శాతం వరకు రాబడిని అందిస్తాయి. 180 నుంచి 210 రోజుల కాలపరిమితితో FDలో 5.65 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి.
దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఎస్బీఐ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల FD పథకాలు అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. ఈ బ్యాంకు 46 నుంచి 179 రోజుల కాలపరిమితి FDలపై 6.05 శాతం నుంచి గరిష్టంగా 7.15 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
రూ. 3లక్షల డిపాజిట్ చేస్తే.. రూ. 1,58,974 వరకు ఫిక్స్డ్ వడ్డీ :
మీలో ఎవరైనా ఎస్బీఐలో 6 ఏళ్ల FD పథకంలో రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో పాటు మొత్తం రూ. 4,30,120 పొందుతారు. అంటే.. 6 ఏళ్లలో సుమారుగా రూ. 1,30,120 వడ్డీని సంపాదిస్తారు. అలాగే, సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 4,56,276 సంపాదిస్తారు.
ఇందులో రూ. 1,56,276 కేవలం వడ్డీగా మాత్రమే వస్తుంది. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లు ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు. రూ. 3 లక్షలు డిపాజిట్ ద్వారా 6 ఏళ్ల తర్వాత మొత్తం రూ. 4,58,974 పొందుతారు. అందులో రూ. 1,58,974 వడ్డీనే సంపాదించుకోవచ్చు.
