RRR: బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ నెంబర్ ఆరు!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రసెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.....

RRR: బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ నెంబర్ ఆరు!

Rrr 6th Movie To Collect 100 Cr After Pandemic

RRR: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రసెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను చూసేందుకు తొలిరోజు నుండే థియేటర్ల ముందు జనాలు బారులు తీరాలి. తొలి ఆటకే ఈ సినిమాకు సూపర్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తిని కనబరిచారు. అయితే ఈ సినిమాకు నార్త్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ సమయంలో అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్ ఆందోళనకు గురయ్యింది.

RRR: తగ్గని జోరు.. హిందీలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆర్ఆర్ఆర్!

కానీ సినిమా రిలీజ్ అయ్యాక తొలిరోజు రూ.19 కోట్ల మేర వసూళ్లు రావడం.. అటుపై మౌత్ టాక్‌తో ఈ సినిమాకు నార్త్‌లోనూ క్రేజ్ ఏర్పడటంతో ఈ సినిమాను చూసేందుకు అక్కడి ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో క్రమంగా ఆర్ఆర్ఆర్ చిత్ర కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఇక ఇదే జోరులో తాజాగా ఈ సినిమా హిందీలో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. దీన్ని బట్టి అక్కడ ఈ సినిమాకు మౌత్ టాక్ ఎంతగా తోడయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో హిందీలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం రాజమౌళికి ఇది మూడోసారి కాగా.. హీరోలు చరణ్, తారక్‌లకు ఇది తొలిసారి.

ఇక కరోనా ప్రభావం తరువాత వచ్చిన చిత్రాల్లో బాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ 6వ స్థానాన్ని సంపాదించింది. అంతకంటే ముందుగా సూర్యవంశీ, 83 ది ఫిలిం, పుష్ప, గంగూబాయి కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాలు వంద కోట్ల మార్క్‌ను టచ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలకు అక్కడి జనం నీరాజనాలు పట్టడంతో ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చి పడ్డాయి.

RRR : సినిమా అర్దమవ్వట్లేదు.. సబ్ టైటిల్స్ కావాలి.. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి ఆడియన్స్ విజ్ఞప్తి

అయితే ఆర్ఆర్ఆర్ చిత్రానిక నార్త్‌లో రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ లేకపోవడం.. రిలీజ్ తరువాత ఈ సినిమా అక్కడ పుంజుకోవడం చూస్తుంటే మున్ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడు నటులు ఆలియా భట్, అజయ్ దవ్గన్‌లు కూడా నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పాలి.