Alia Bhatt Ranbir Kapoor Marriage: వెడ్డింగ్ డేట్ లాక్.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వేదిక ఫిక్స్?

రణ్ బీర్-అలియా సైలంట్ గా పని కానిచ్చేయాలనుకుంటున్నారు. కత్రినా-విక్కీ కౌశల్ జంటను ఆదర్శంగా తీసుకుని అసలేం జరగడం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఓ పక్క ఈ నెలలో ముహూర్తానికి..

Alia Bhatt Ranbir Kapoor Marriage: వెడ్డింగ్ డేట్ లాక్.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వేదిక ఫిక్స్?

Alia Bhatt Ranbir Kapoor Marriage

Alia Bhatt Ranbir Kapoor Marriage: రణ్ బీర్-అలియా సైలంట్ గా పని కానిచ్చేయాలనుకుంటున్నారు. కత్రినా-విక్కీ కౌశల్ జంటను ఆదర్శంగా తీసుకుని అసలేం జరగడం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఓ పక్క ఈ నెలలో ముహూర్తానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు ముంబైలో టాక్ నడుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కి వేదికను కూడా ఫిక్స్ చేసుకున్నారు ఈ లవ్లీ కపుల్.

Alia Bhatt: అలియా నామస్మరణ.. ఏవుడ్‌లో చూసినా భట్ బేబీ పేరే!

2020 డిసెంబర్‌లో జరగాల్సిన రణ్ బీర్ – అలియాల పెళ్లి… కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అప్పుడో ఇప్పుడో అంటోన్న అసలైన పెళ్లి డేట్ మాత్రం ముందుకు పడటం లేదు. అయితే ఈ ఏప్రిల్‌ లోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంతో ఒక్కటవుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్కీ కౌశల్‌ – కత్రినా కైఫ్‌ జంటలా వీరు కూడా పెళ్లి విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Alia Bhatt: ఫాఫమ్ అలియా.. పగలబడి నవ్వినా తప్పేనా?!

ఇప్పటికే వెడ్డింగ్ డేట్ లాక్ చేసుకున్నఅలియా – రణ్ బీర్… హై క్లాస్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ లా కాకుండా వాళ్ల ఫ్యామిలీ సెంటిమెంట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారనేది గాసిప్. ఇక కపూర్ వంశానికి చెందిన తరతరాల నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్‌ – ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ముంబై టాక్. అక్కడే అతికొద్ది మంది సన్నిహితుల నడుమ అతిత్వరలో రణ్ బీర్ – అలియా విహాహం జరగనున్నట్టు తెలుస్తోంది.