Alia Bhatt : రెండు రోజులు అలియా సందడి..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన రెండు బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి..

Alia Bhatt : రెండు రోజులు అలియా సందడి..

Alia Bhatt

Alia Bhatt: 2022 జనవరి 6, 7 తేదీలు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కెరీర్‌లో మెమరబుల్‌గా నిలిచిపోతాయి. ఎందుకంటే ఆమె నటించిన రెండు బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఆ తేదీల్లోనే విడుదల కాబోతున్నాయి. అలియా మెయిన్ లీడ్‌గా క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన సినిమా ‘గంగుబాయి కథియావాడి’.. (మాఫియా క్వీన్)..

RRR Release Date : రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి ముందే..

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ హుస్సైన్‌ జెదీ, గంగూబాయి జీవితం ఆధారంగా ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ అనే పుస్తకం రచించగా అత్యధిక కాపీలు అమ్ముడైన పుస్తకంగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. 2022 జనవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత

ఇక మరో మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. ఫ్యాన్స్, ఆడియన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎదురు చూస్తున్నారు. శనివారం ‘ఆర్ఆర్ఆర్’ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2022 జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022 జనవరి 6, 7 తేదీల్లో అలియా నటించిన రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..