Allu Arjun: ప్రమోషన్స్ వివాదం.. బన్నీకి బ్రాండే బ్యాడా?

ఏ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ పుష్ప ఓ రేంజ్ స్ట్రాటజీతో తన స్టామినా చూపించాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. బన్నీ స్టార్డమ్ ను, తమ బ్రాండ్ ప్రమోషన్ కు ఉపయోగించుకోవాలని చాలా..

Allu Arjun: ప్రమోషన్స్ వివాదం.. బన్నీకి బ్రాండే బ్యాడా?

Allu Arjun

Allu Arjun: ఏ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ పుష్ప ఓ రేంజ్ స్ట్రాటజీతో తన స్టామినా చూపించాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. బన్నీ స్టార్డమ్ ను, తమ బ్రాండ్ ప్రమోషన్ కు ఉపయోగించుకోవాలని చాలా కంపెనీలు బన్నీ వైపు చూస్తున్నాయి. కానీ, బన్నీ ఈ మధ్య ఏయాడ్ చేసినా ఏదో ఒక కాంట్రవర్శీకి కారణమవుతున్నాయి.

Chiranjeevi : చిరంజీవికి కరోనా నెగెటివ్.. వర్క్ మోడ్‌లో మెగాస్టార్!

క్రేజ్ ఉన్న హీరోలతో బ్రాండ్స్ ప్రమోట్ చేపించుకోవడం రెగ్యులర్ గానే జరుగుతుంది. వరుసగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న బన్నీ అంబాసిడర్ గా నాలుగు బ్రాండ్లున్నాయి. అందులో కాంట్రవర్శీ తో రెండు బ్రాండ్లు వార్తల్లో నిలిచాయి. రీసెంట్ గా బన్నీ చేసిన రాపిడో యాడ్ విషయంలో కాంట్రవర్శీ జరిగింది. ఆర్టీసిని కించపరిచే విధంగా అల్లు అర్జున్ రాపిడో యాడ్ ఉందంటూ ఆర్టీసి ఛైర్మెన్ సజ్జనార్ బన్నీకి, రాపిడోకి లీగల్ నోటీసులే పంపించాడు. చివరికి ఆ యాడ్ లోంచి ఆర్టీసీ బస్సును ఎడిట్ చేస్తే కానీ ఆ వివాదం సద్ధుమనగలేదు.

Anasuya: స్పెషల్ క్యారెక్టర్స్ తో బ్రాండ్ క్రియేట్ చేస్తున్న అనసూయ!

ఏ ముహూర్తాన తగ్గేదేలే అన్నాడో గాని, బన్నీ క్రేజ్ నిజంగానే ఎక్కడా తగ్గట్లేదు. అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ని, పుష్ప ఆల్ టైమ్ హై కి చేర్చేసింది. దాంతో జొమాటో భారీ ఆఫరిచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ తో యాడ్ చేపించుకుంది. ఈ యాడ్ విజువల్ గా బాగుంది. అల్లు అర్జున్ స్టయిలిష్ లుక్ లో ఉన్నాడు, తగ్గేదేలే డైలాగ్ పేలింది అని కొంత మంది అంటుంటే, ఈ యాడ్ లో సౌత్ సినిమా ఇండస్ట్రీని కించ పరిచారంటూ మరో వర్గం కాంట్రవర్శీయల్ కామెంట్స్ చేస్తుంది.