Anasuya: స్పెషల్ క్యారెక్టర్స్ తో బ్రాండ్ క్రియేట్ చేస్తున్న అనసూయ!

బుల్లితెరపై గ్లామర్ ట్రెండ్ క్రియేట్ చేసిన అనుసూయ, వెండితెరపై సపరేట్ బ్రాండ్ సెట్ చేసుకుంది. బుల్లి తెరపై గ్లామర్ డోస్ పెంచి స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్న అనసూయ సినిమాల్లోనూ..

Anasuya: స్పెషల్ క్యారెక్టర్స్ తో బ్రాండ్ క్రియేట్ చేస్తున్న అనసూయ!

Anasuya

Anasuya: బుల్లితెరపై గ్లామర్ ట్రెండ్ క్రియేట్ చేసిన అనుసూయ, వెండితెరపై సపరేట్ బ్రాండ్ సెట్ చేసుకుంది. బుల్లి తెరపై గ్లామర్ డోస్ పెంచి స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్న అనసూయ సినిమాల్లోనూ ఎక్కడా తగ్గట్లేదు. సపరేట్ క్యారెక్టరైజేషన్, మాస్ లుక్ తో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ వరుసగా సినిమాల్లో ఆఫర్లు కొట్టేస్తుంది. తనకంటూ స్పెషల్ క్యారెక్టర్ బ్రాండ్ సెట్ చేసుకుంది.

Thalapathy Vijay: హాట్ టాపిక్.. హీరో విజయ్-పుదుచ్చేరి సీఎం భేటీ!

లేటెస్ట్ గా అనసూయ నటిస్తున్న దర్జా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయింది. పుష్ప తర్వాత దర్జాలోనూ హీరో సునీల్ తో జతకట్టిన అనసూయ కనకం అనే స్పెషల్ క్యారెక్టర్లో కనిపించబోతుంది. దర్జా ఫస్ట్ లుక్ టీజర్ తోనే మాస్ లుక్ లో తన విశ్వరూపం చూపిస్తోంది అనసూయ. ఎఫ్ 2, విన్నర్, చావుకబురు చల్లగా సినిమాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ తో ఐటం సాగ్స్ తో గ్లామర్ చూపించిన అనసూయ ఇప్పుడు సినిమాల్లో ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ చేస్తూ డీ గ్లామర్ రోల్స్ తో రోజు రోజుకీ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

Rahul Ramakrishna: తూచ్ నేను జోక్ చేశా.. అందరినీ ఫూల్స్ చేసిన రాహుల్!

సుకుమార్ రంగస్థలంలో ఇచ్చిన రంగమ్మత్త క్యారెక్టరే అనసూయకు ఈ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఢీగ్లామర్ రోలైనా కూడా మాస్ క్యారెక్ట్ ర్ లో రంగమ్మత్త, విలనీ లుక్స్ తో దాక్షాయణి క్యారెక్టర్ లో అనసూయ పెర్ఫామెన్స్ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసే ఈ మధ్య స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల్లో అనసూయ కోసం స్పెషల్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నారు.

Tollywood : సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

రంగస్థలం, పుష్ప సూపర్ హిట్ కావడంతో రమేశ్ వర్మ.. రవితేజ సినిమా కోసం చంద్రకళ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఖిలాడిలో ఆఫరిచ్చాడు. హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ రివీల్ చేసినట్టే ఖిలాడి సినిమాలో అనసూయ క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఖిలాడి సినిమాలో అనసూయ, రవితజకు అత్తగా కనిపించబోతుందని టాక్. రంగమ్మత్త, దాక్షాయణి, చంద్రకళ, కనకం ఇలాంటి ప్రత్యేక పాత్రలు ఇంకా ఎన్ని చేస్తుందో చూడాలి అనుకుంటున్నారు సినీ అభిమానులు.