Tollywood : సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

తెలుగు సినీ పరిశ్రమ మరోసారి సమావేశం కానుంది. సోమవారం ఉదయం 11 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్వర్యంలో ఈ కీలక సమావేశం జరగనుంది.

Tollywood : సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

Tollywood

Tollywood: తెలుగు సినీ పరిశ్రమ మరోసారి సమావేశం కానుంది. సోమవారం ఉదయం 11 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్వర్యంలో ఈ కీలక సమావేశం జరగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని మీడియాకి సమాచారం అందించిన పెద్దలు ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదం.. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గింపు.. కరోనా ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

ఇక, మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల సమావేశం తర్వాత జరగనున్న కీలక సమావేశం కావడంతో ఈ సమావేశం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చిరంజీవి సోమవారం జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించిన విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండగా.. ఏపీలో సినిమాల ప్రదర్శనపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది.

Pushpa-Viral Video: వామ్మో.. బన్నీ హుక్ స్టెప్ దింపేసిన బుడ్డోడు!

ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల విక్రయం, ధరల తగ్గింపు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఇప్పటివరకు సుమారు 175 థియేటర్లు మూత పడినట్టు సమాచారం ఉండగా.. మరోవైపు టికెట్ రేట్స్ అంశం పలుమార్లు రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా రాష్ట్రంలో యాభై శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.

Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

ఏపీ ప్రభుత్వంతో పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చలు జరపడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ ఓ కమిటీ ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ప్రభుత్వ పెద్దలతో చర్చలు కూడా జరిపింది. ఇక.. ఈ కమిటీ సభ్యులే కాకుండా టాలీవుడ్ పెద్దలు కూడా పలుమార్లు ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం జగన్ ను కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. సోమవారం జరగబోయే టీఎఫ్‌సీసీ సమావేశంలో ఈ భేటీతో పాటు ఇన్నాళ్లు జరిపిన చర్చల అంశాలను పరిశీలించనున్నట్లు తెలుస్తుంది.