Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

సౌత్ లో ఒకటైన కన్నడ బాషలో తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదుచేసుకున్న కేజేఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు.

Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

Salaar

Salaar: సౌత్ లో ఒకటైన కన్నడ బాషలో తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదుచేసుకున్న కేజేఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాగా.. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకోగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు.

Pushpa-Viral Video: వామ్మో.. బన్నీ హుక్ స్టెప్ దింపేసిన బుడ్డోడు!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. అలాంటిది ఆయనతో కేజీఎఫ్ లాంటి భారీ యాక్షన్ సినిమాను తీసిన దర్శకుడి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉండాలి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను ప్రశాంత్ తెరకెక్కించాడని టీజర్, లుక్స్ లోనే చెప్పేశాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలే ఈ సినిమాకి కనీవినీ ఎరుగని స్థాయిలో బిజినెస్ చేసి పెడుతున్నాయని టాక్.

Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

సలార్ సినిమాకి గాను దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ ఉంటుందని ఒక అంచనా. ఇందులో వంద కోట్ల వరకు హీరో ప్రభాస్ రెమ్యునరేషన్ కాగా.. మిగతాది సినిమా ఖర్చు. అయితే.. షూటింగ్ వాయిదాల కారణంగా ఈ బడ్జెట్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉండగా.. ఎటు తిరిగి నాలుగు వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉందని అంచనా వేశారు. ఇంకా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి సంబంధించి బిజినెస్ మొదలు కాలేదు.

Khiladi మరో సాంగ్ రిలీజ్.. క్యాచ్ మీ అంటూ ఇరగదీసిన డింపుల్!

అయితే.. ఓటీటీ సంస్థలు మాత్రం డిజిటల్ హక్కుల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయట. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఏకంగా రూ.200 కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ సినిమాల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి కూడా ఈ స్థాయి ఆఫర్లు ఇవ్వని ఓటీటీలు కేవలం థియేటర్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ కోసం ఈ స్థాయిలో ఆఫర్ చేశాయంటే ఇక థియేట్రికల్ హక్కులు ఏ స్థాయిలో పలుకుతాయోనని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.