Thalapathy Vijay: హాట్ టాపిక్.. హీరో విజయ్-పుదుచ్చేరి సీఎం భేటీ!

కాదు కూడదు.. వద్దు నాకొద్దు అంటూనే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చేశాడు. తమ అభిమాన సంఘాలు.. విజయ్ మధ్య రాజకీయ అరంగేట్రంపై కొంతకాలం అభిప్రాయం..

Thalapathy Vijay: హాట్ టాపిక్.. హీరో విజయ్-పుదుచ్చేరి సీఎం భేటీ!

Thalapathy Vijay

Thalapathy Vijay: కాదు కూడదు.. వద్దు నాకొద్దు అంటూనే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చేశాడు. తమ అభిమాన సంఘాలు.. విజయ్ మధ్య రాజకీయ అరంగేట్రంపై కొంతకాలం అభిప్రాయం భేదాలు కూడా కనిపించగా.. ఇదే విషయంలో గతంలో విజయ్ తండ్రిపైనే కోర్టుకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అభిమానుల కోరికతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పార్టీని పోటీకి నిలబెట్టారు.

Rahul Ramakrishna: తూచ్ నేను జోక్ చేశా.. అందరినీ ఫూల్స్ చేసిన రాహుల్!

తమిళనాడులో విజయ్ పార్టీకి కావాల్సినంత పొలిటికల్ స్పేస్ కూడా ఉందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు తేల్చగా.. విజయ్ కూడా అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా విజయ్ అభిమానులు భారీగా ఉన్నారు. ఇప్పుడు పుదుచ్చేరిలో నగర పాలక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో కూడా అభిమాన సంఘం విజయ్‌ మక్కల్‌ ఇయక్కం నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Tollywood : సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

ఇదిలా ఉండగానే పుదుచ్చేరి సీఎం ఎన్‌ రంగస్వామి విజయ్ తో భేటీ అయ్యారు. చెన్నై పయనూర్‌లోని విజయ్‌ ఇంట్లో తాజాగా ఈ భేటీ జరిగింది. భేటీ తర్వాత రంగ స్వామిని మీడియా ప్రశ్నించగా, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు వ్యాఖ్యానించారు. విజయ్‌ తనకు మంచి మిత్రుడని, ఆయనపై అభిమానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ భేటీ రాజకీయంగా అతి పుదుచ్చేరి, ఇటు తమిళనాడు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

Boney Kapoor: బాలీవుడ్ షో మ్యాన్ మూవీ ప్లానింగ్.. విడుదలకి ఐదు సినిమాలు!

పుదుచ్చేరిలో ప్రస్తుతం ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. రంగస్వామి సీఎం అయ్యాక ఇంత వరకు ప్రధాని మోడీని కూడా కలవలేదు. అలాంటిది విజయ్‌ను కలిసేందుకు చెన్నై రావడాన్ని రాజకీయ వర్గాలు నిశితంగానే పరిశీలిస్తున్నాయి. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పుదుచ్చేరి వ్యవహారాలు చూసే పి.ఆనంద్‌ ఆ రాష్ట్రంలో యాక్టివ్ గా ఉండడం.. విజయ్-రంగస్వామి భేటీతో తరవాత రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.