Chiranjeevi : చిరంజీవికి కరోనా నెగెటివ్.. వర్క్ మోడ్‌లో మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు సినిమాలకి ఓకే చెప్పిన చిరంజీవి.. అందులో ఒక సినిమా షూటింగ్ అయిపోగా మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ నడుస్తున్నాయి.

Chiranjeevi : చిరంజీవికి కరోనా నెగెటివ్.. వర్క్ మోడ్‌లో మెగాస్టార్!

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు సినిమాలకి ఓకే చెప్పిన చిరంజీవి.. అందులో ఒక సినిమా షూటింగ్ అయిపోగా మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ నడుస్తున్నాయి. అన్నిటికి డేట్స్ ఇస్తున్న చిరుకి ఇటీవల కరోనా రావడంతో ఒక్కసారిగా అన్నిటికి బ్రేక్ పడింది. రెండు వారాలుగా రెస్ట్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తనకు కరోనా తగ్గిపోయిందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.

Lata Mangeshkar : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. Live Updates

కరోనా తగ్గడంతో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటున్న చిరంజీవి.. ఈసారి పూర్తి స్టీమ్‌తో తిరిగి పనిలోకి వెళ్లినట్లు ట్వీట్ చేశారు. నేను కోలుకునేలా చేసిన మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో షూటింగ్ స్పాట్ నుండి తీసిన వర్కింగ్ ఫోటోలను కూడా జత చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మళ్ళీ కోలుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Anasuya: స్పెషల్ క్యారెక్టర్స్ తో బ్రాండ్ క్రియేట్ చేస్తున్న అనసూయ!

ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొటుండగా.. ఈ సినిమా షూట్ కోసం నయనతార కూడా హైదరాబాద్ కి వచ్చింది. ఒక వైపు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో వైపు రాత్రి పూట ఆచార్య సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. మరోవైపు లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో సినిమాకి ఒకేసారి షూటింగ్ షెడ్యూల్ సిద్ధం చేయనున్నారట.