Lata Mangeshkar: నైటింగేల్ ఆఫ్ ఇండియా, సింగింగ్ లెజెండ్ ‘లతా మంగేష్కర్’ కన్నుమూత

ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 సంవత్సరాల లతా మంగేష్కర్.. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు.

Lata Mangeshkar: నైటింగేల్ ఆఫ్ ఇండియా, సింగింగ్ లెజెండ్ ‘లతా మంగేష్కర్’ కన్నుమూత

Lata Mangeshkar

Lata Mangeshkar: ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 సంవత్సరాల లతా మంగేష్కర్.. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పోరాడి ఓడిపోయారు. శనివారం నుండి ఆమె ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని చెప్పిన వైద్యులు ఆమె కన్నుమూసినట్లుగా ఆదివారం ఉదయం ప్రకటించారు.

Anasuya: స్పెషల్ క్యారెక్టర్స్ తో బ్రాండ్ క్రియేట్ చేస్తున్న అనసూయ!

గత నెల మొదటి వారం నుంచి ఆస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి గత రెండు రోజులుగా విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతోగత నెల 8న ముంబయ్ లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతాజీ.. అప్పటి నుంచీ ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈమధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా.. ఆమె కోలుకున్నట్టు అభిమానులు సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది.

Thalapathy Vijay: హాట్ టాపిక్.. హీరో విజయ్-పుదుచ్చేరి సీఎం భేటీ!

కరోనాతో పాటు న్యూమోనియాతో బాధపడ్డ ఆమె గత మూడు రోజులుగా ఆరోగ్యం క్షిణించడంతో ఆదివారం కన్నుమూసినట్లుగా ప్రకటించారు. లతాజీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో.. లతా మంగేష్కర్ చెల్లెలు ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే హుటా హుటిన బ్రీచ్ కాండీ హాస్పిటల్ కు చేరుకుకోగా.. డాక్టర్లతో మాట్లాడిన ఆమె.. శనివారం రాత్రి వరకు లతాజీ ఆరోగ్యంపై మీడియాకు అప్ డేట్ ఇచ్చారు. చివరిగా ఆదివారం ఉదయం ఆమె కన్నుమూసినట్లుగా ప్రకటించారు.