Pushpa 2 : తెలుగు, మలయాళంలో కాదు పుష్ప టీజర్ ఎక్కువమంది ఏ ఆడియన్స్ చూశారో తెలుసా?

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ తెలుగు, మలయాళంలో కంటే ఆ భాషలో ఎక్కువ వ్యూస్ సంపాదించింది.

Pushpa 2 : తెలుగు, మలయాళంలో కాదు పుష్ప టీజర్ ఎక్కువమంది ఏ ఆడియన్స్ చూశారో తెలుసా?

Allu Arjun Pushpa 2 had record views in hindi over than telugu

Pushpa 2 : అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 టీజర్ వచ్చేసింది. బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. మూడు నిమిషాలు టీజర్ లోనే ఓ రేంజ్ ఎలివేషన్ సీన్స్ చూపించడంతో యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ని సంపాదిస్తుంది. కాగా ఈ టీజర్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ అత్యధిక వ్యూస్ సంపాదించింది తెలుగులో కాదు. టాలీవుడ్ తరువాత అల్లు అర్జున్ కి మలయాళంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది.

Allu Arjun : అల్లు అర్జున్‌కి సెలబ్రేటిస్ బర్త్ డే విషెస్.. పుష్ప రాక్స్ అంటున్న చిరు!

దీంతో మలయాళంలో ఎక్కువ వ్యూస్ వచ్చాయని భ్రమ పడతారు ఏమో, అలా అనుకోకండి. ఎందుకంటే ఈ సినిమా ఈ రెండు భాషల్లో కంటే హిందీ లాంగ్వేజ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించింది. తెలుగులో ఇప్పటి వరకు ఈ టీజర్ కి 18 మిలియన్ల వ్యూస్ రాగా, హిందీలో ఏకంగా 21 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. వీటి తరువాత తమిళంలో 1.6 మిలియన్, మలయాళంలో 727K, కన్నడలో 555K వ్యూస్ అందుకుంది. ఈ వ్యూస్ బట్టి చూస్తుంటే పుష్పకి సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువ క్రేజ్ ఉన్నట్లు తెలుస్తుంది.

Allu Arjun : మెగా హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు అల్లు అర్జున్ ప్రయాణం..

పుష్ప 1 లో తన మ్యానరిజం, డైలాగ్స్ అండ్ డాన్సులతో పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్‌నే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. కాగా మొదటి భాగంలో సునీల్, అజయ్ ఘోష్ విలన్స్ గా కనిపించగా రెండో భాగంలో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.