Allu Arjun : అల్లు అర్జున్‌కి సెలబ్రేటిస్ బర్త్ డే విషెస్.. పుష్ప రాక్స్ అంటున్న చిరు!

ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేటిస్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. చిరంజీవి ఏమన్నాడో తెలుసా?

Allu Arjun : అల్లు అర్జున్‌కి సెలబ్రేటిస్ బర్త్ డే విషెస్.. పుష్ప రాక్స్ అంటున్న చిరు!

Chiranjeevi and tollywood celebrities wishes to Allu Arjun

Updated On : April 8, 2023 / 10:43 AM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు ఈరోజు (ఏప్రిల్ 8) కావడంతో బన్నీ అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ తో సందడి చేస్తున్నారు. నిజానికి ఈ వేడుకలు నిన్నటి నుంచే మొదలయ్యాయి అని చెప్పాలి. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2) నుంచి టీజర్ ని రిలీజ్ చేసి అభిమానులకు గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ఒక మూడు నిమిషాల వీడియోతో సినిమా ఎలా ఉండబోతుందో ఒక తెలియజేశారు. ఇక ఈ టీజర్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ కాళీ మాత గెటప్ లో కనిపించి అదరగొట్టాడు.

Pushpa 2 : కాళీమాత రూపంలో పుష్ప రాజ్.. వైరల్ అవుతున్న ఫోటో!

చీర కట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, ఒంటి నిండా బంగారంతో చేతిలో గన్ పట్టుకొని ఉన్న అల్లు అర్జున్ లుక్ చూసి సెలబ్రేటిస్ సైతం ఫిదా అవుతున్నారు. సినిమా పై తనకి ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ లు చేస్తున్నారు. అలాగే తనకి బర్త్ డే విషెస్ కూడా తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి (Chiranjeevi) కూడా విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని చేసుకోవాలి. ఇక పుష్పలోని నీ ఫస్ట్ లుక్ రాక్స్ అంటూ ట్వీట్ చేశాడు.

Allu Arjun : మెగా హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు అల్లు అర్జున్ ప్రయాణం..

అలాగే సాయి ధరమ్ తేజ్, నిఖిల్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, హరీష్ శంకర్, ఎస్ ఎస్ థమన్, సురేంద్ర రెడ్డి, గోపీచంద్ మలినేనితో పాటు మరి కొందరు బర్త్ డే విషెస్ తెలియజేశారు.