Allu Arjun : మెగా హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు అల్లు అర్జున్ ప్రయాణం..

మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యి.. స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు తెలుసా?

Allu Arjun : మెగా హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు అల్లు అర్జున్ ప్రయాణం..

Icon Star Allu Arjun special story on his birthday

Allu Arjun : లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచమైన హీరో అల్లు అర్జున్ (Allu Arjun). ఈరోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అంతేకాదు ఈ ఏడాదితో ఇండస్ట్రీలో కూడా హీరోగా 20 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ హీరోగా పరిచయం అవ్వడానికి కంటే ముందు పలు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. చిరంజీవి (Chiranjeevi) నటించిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మొదటిసారి వెండితెరకు పరిచయం అయ్యాడు.

Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చిరు ఎమోషనల్ పోస్ట్!

ఆ తరువాత కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇక 18 ఏళ్ళ వయసులో డాడీ సినిమాలో డాన్సర్ గా కనిపించి మెగా ఆడియన్స్ అభిమానాన్ని సొంత చేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు తరువాత 2003 లో గంగోత్రి సినిమాతో హీరోగా డెబ్యూట్ చేశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఈ సినిమా విడుదలయ్యి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే అల్లు అర్జున్ మంచి గుర్తింపు తీసుకు వచ్చిన సినిమా అంటే ఆర్య (Arya). ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచమయ్యాడు.

Pushpa 2 : కాళీమాత రూపంలో పుష్ప రాజ్.. వైరల్ అవుతున్న ఫోటో!

ఆర్య హిట్ అల్లు అర్జున్ కి, సుకుమార్ కి మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో మళ్ళీ 2009 లో ఆర్య 2 తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. తన డ్రెస్సింగ్ స్టైల్ తో యూత్ అందరికి ఒక ఐకాన్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ కి మాస్ హీరో ఇమేజ్ ని తీసుకు వచ్చిన సినిమా అంటే దేశముదురు. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ ని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. తన కెరీర్ లో చూసుకుంటే.. ఎక్కువ విజయాలు సాధించిన సినిమాలే ఉన్నాయి.

ఇక 2014 లో వచ్చిన రేసుగుర్రం సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ తరువాత కూడా సరైనోడు, సన్ అఫ్ సత్యమూర్తి, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలతో వరుసగా 100 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ ని అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడిగా నిలిచాడు. అలా వైకుంఠపురంలో సినిమాతో అయితే ఏకంగా 280 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.

Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..

ఈ సినిమా తరువాత వచ్చిన పుష్ప (Pushpa) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటా. సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మూడో ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రాన్ని పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ అంటూ రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అల్లు అర్జున్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయ్యింది. తాజాగా సెకండ్ పార్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ అంచనాలకు మించి టీజర్ ఉండడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

కెరీర్ మొదటిలో మెగా హీరో అనిపించుకున్న అల్లు అర్జున్.. తనకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకొని స్టైలిష్ స్టార్‌గా, పాత్ర కోసం సినిమా కోసం తన చూపించే డెడికేషన్‌కి ఐకాన్ స్టార్ అనిపించుకుంటూ, ఒక రీజినల్ సినిమాతో పాన్ ఇండియా హిట్టుని అందుకొని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్ ఇంకా ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.