Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..

ఇటీవల పుష్ప (Pushpa 2) ఎక్కడ ఉన్నాడు అంటూ ఒక సస్పెన్స్ వీడియోతో ఆడియన్స్ లో మంచి క్యూరియోసిటీని క్రియేట్ చేసిన మూవీ టీం.. తాజాగా ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు.

Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..

Screenshots from Pushpa 2 Teaser

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా పుష్ప (Pushpa). టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడమే కాకుండా, భారీ క్రేజ్ ని కూడా సొంతం చేసుకుంది. దీంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ ఏర్పడింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ విలన్ రోల్స్ చేయగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు.

ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. పుష్ప ఎక్కడ అంటూ ఒక సస్పెన్స్ వీడియోతో ఆడియన్స్ లో మంచి క్యూరియోసిటీని కలగజేశారు. అయితే మొత్తం వీడియోని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తామంటూ ప్రకటినించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ టీజర్ ని రిలీజ్ చేశారు. దాదాపు 3 నిమిషాలు నిడివి ఉన్న టీజర్ లో పుష్ప తిరుపతి జైలు నుంచి తప్పించుకోగా, తన కోసం శేషాచలం అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెడతారు. అయితే ఆ సెర్చింగ్ లో పోలీసులకు పుష్ప చొక్కా దొరుకుతుంది. సుమారు 8 బులెట్లు తగలడంతో పుష్ప చనిపోయి ఉంటాడు అని న్యూస్ లో వార్త వస్తుంది.

Allu Arjun: చరణ్ బర్త్ డే వేడుకల్లో కనిపించని అల్లు అర్జున్.. రీజన్ ఏమిటో చెప్పిన బన్నీ టీమ్!

దీంతో చింతూరు, తిరుపతి ఏరియాలో పుష్ప కోసం అల్లర్లు చేయడం మొదలు పెడతారు జనాలు. ఆ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప స్మగ్లింగ్ చేసి సంపాదిస్తున్నారు అని చెబుతున్నారు. కానీ ఆ సంపాదించింది మా మంచి కోసం ఖర్చు పెడుతున్నాడని తెలుసా. మాకు ఇల్లు కట్టించాడు, కష్ట సుఖాలు చూసుకుంటున్నాడని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక ఇంతలో ఒక మీడియా ఛానల్ అడివిలో పులిలు కోసం ఏర్పాటు చేసిన ఒక కెమెరాలో పుష్ప కనిపిస్తాడు. దీంతో పుష్ప బ్రతికే ఉన్నాడు అని అందరు ఊపిరి పిలుచుకుంటారు.

కాగా ఆ వీడియోలో పులి కెమెరా ముందుకు వస్తుంది. ఆ తరువాత రెండు అడుగులు వెనక్కి వేసి ఒక వ్యక్తికి దారిస్తుంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పించింది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం అనే డైలాగ్ థియేటర్ లో విజుల్స్ వేయించడం ఖాయం. ఇక ఈ సెకండ్ పార్ట్ చైనా, జపాన్, మలేషియాలో కూడా పుష్ప స్మగ్లింగ్ చేయనున్నట్లు టీజర్ లో కనిపిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప ది రైజ్ విజయంలో దేవిశ్రీ మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో పుష్ప ది రూల్ నుంచి కూడా అదే రేంజ్ బీట్స్ ఆశిస్తున్నారు అభిమానులు.