Allu Arjun : అల్లు అర్హ చేసిన పనికి అల్లు అర్జున్ షాక్.. స్నేహారెడ్డి పోస్ట్ చూశారా?

పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ లో గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ అడవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వెకేషన్ లో అల్లు అర్హ (Allu Arha) చేసిన స్టంట్ చూసి అల్లు అర్జున్ షాక్ అయ్యాడు.

Allu Arjun : అల్లు అర్హ చేసిన పనికి అల్లు అర్జున్ షాక్.. స్నేహారెడ్డి పోస్ట్ చూశారా?

allu arjun allu arha

Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం హాలీడే వెకేషన్ లో ఉన్నాడు. పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ లో గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ అడవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంది. తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) యోగా చేస్తున్న ఒక ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Allu Arjun : అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడు.. వరుడు హీరోయిన్ భానుశ్రీ!

ఆ ఫొటోలో అర్హ తన అరికాళ్ళని తన తలకి టచ్ చేస్తున్న యోగా ముద్రలో కనిపిస్తుంది. అర్హ ఆ యోగా భంగిమ చేస్తుండగా, పక్కన ఉన్న అల్లు అర్జున్ చూసి షాక్ అయిన చిత్రం కనిపిస్తుంది. 6 ఏళ్ళ అల్లు అర్హ అటువంటి యోగ ముద్రని వేయడంతో అల్లు అర్జున్ మాత్రమే కాదు, అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. కాగా స్నేహారెడ్డి యోగాని బాగా ఫాలో అవుతుంటుంది. ఆమె యోగా చేస్తున్న పలు వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అర్హ, తన తల్లి నుంచే యోగా నేర్చుకుంది అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Allu Arjun: సందీప్ రెడ్డి సినిమా కోసం అల్లు అర్జున్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా..?

ఇక ఇది ఇలా ఉంటే, సమంత శాకుంతలం (Shaakuntalam) సినిమాతో ఈ ఏడాది వెండితెర అరగేంట్రం కూడా చేయబోతుంది అల్లు వారసురాలు అల్లు అర్హ. మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ.. ప్రిన్స్ భారత పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ లో.. అర్హ సింహం పై స్వారీ చేస్తున్న విజువల అల్లు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. దీంతో తమ అభిమాన హీరో వారసురాలిని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

allu arjun allu arha

allu arjun allu arha