Pushpa: తగ్గేదే లే.. అంటూ అదరగొట్టిన అల్లు అర్హ, అల్లు అయాన్

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.. అల్లు అర్హ, అల్లు అయాన్.

Pushpa: తగ్గేదే లే.. అంటూ అదరగొట్టిన అల్లు అర్హ, అల్లు అయాన్

Pushpa Allu Kids

Pushpa: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.. అల్లు అర్హ, అల్లు అయాన్. బన్నీ ఎప్పుడూ తన పిల్లల అప్ డేట్స్ ను.. సోషల్ మీడియాలో పంచుకోవడాన్నే చూసిన ఫ్యాన్స్.. ఈ స్టేజ్ పై వాళ్లిద్దరిని మాత్రమే కాదు.. వాళ్ల సందడి కూడా చూసి చాలా హ్యాప్పీగా ఫీలయ్యారు. స్టేజ్ పైకి రావడమే స్పెషల్ అంటే.. వాళ్లు చేసిన హడావుడి.. చెప్పిన డైలాగ్స్ అయితే ఇంకా స్పెషల్.

ముందుగా.. నేను మాట్లాడతా అంటూ.. అడిగి మరీ మైక్ తీసుకున్న అల్లు అయాన్.. తగ్గేదే లే అంటూ.. తన తండ్రి మేనరిజాన్ని చూపించి క్లాప్స్ కొట్టించాడు. తర్వాత.. అల్లు అర్హ మైక్ అందుకుని.. అందరికీ నమస్కారం.. హాయ్ అంటూ చాలా క్లాస్ గా పలకరించింది. ఆ తర్వాత తాను కూడా.. తండ్రి స్టైల్లో తగ్గేదే లే.. అంటూ డైలాగ్ చెప్పి.. అదుర్స్ అనిపించింది. వాళ్ల డైలాగులకు.. గెస్టులు, ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరూ క్లాప్స్, విజిల్స్ తో బంపర్ రెస్పాన్స్ ఇచ్చారు.

డైలాగులు చెప్పి కిందకి దిగిన తన కూతురు, కుమార్తెను బన్నీ ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. వాళ్ల ముచ్చట చూడ్డానికి.. అల్లు అరవింద్ తో పాటు.. అక్కడున్న వాళ్లకు 2 కళ్లు చాలలేదనే చెప్పాలి.

Read More:

Pushpa: ఇండస్ట్రీకి బన్నీ బెస్ట్ గిఫ్ట్.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

Pushpa Pre Release Event: ధూం ధాంగా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..!