Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. మహిళలతో అభ్యంతరకర వీడియో కాల్స్.. అమృత్‌పాల్ సింగ్‌ వ్యవహారశైలి ఇది!

అమృత్‌పాల్ సింగ్‌కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు వెల్లడైంది. అమృత్‌పాల్ సింగ్‌కు ఇటీవలే వివాహమైంది. గత ఫిబ్రవరిలోనే బ్రిటన్‌కు చెందిన కిరణ్‌దీప్‌ను అతడు పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడు అనేక మంది మహిళలతో చాటింగ్ చేశాడు.

Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. మహిళలతో అభ్యంతరకర వీడియో కాల్స్.. అమృత్‌పాల్ సింగ్‌ వ్యవహారశైలి ఇది!

Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించిన వ్యవహారాల్ని వెలికితీసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా అతడి ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు పరిశీలించారు.

London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్

ఈ సందర్భంగా అతడి గురించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అమృత్‌పాల్ సింగ్‌కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు వెల్లడైంది. అమృత్‌పాల్ సింగ్‌కు ఇటీవలే వివాహమైంది. గత ఫిబ్రవరిలోనే బ్రిటన్‌కు చెందిన కిరణ్‌దీప్‌ను అతడు పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడు అనేక మంది మహిళలతో చాటింగ్ చేశాడు. చాలా మంది మహిళలకు అభ్యంతరకర చాటింగ్స్, వీడియో కాల్స్ చేశాడు. ఇంకొందరు మహిళల్ని ఆ వీడియోల పేరుతో వేధింపులకు గురి చేశాడు. అలాగే తనకు ఏ మహిళతోనూ శాశ్వత సంబంధాలు అవసరం లేదని, తాత్కాలిక సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నట్లు వాళ్లకు చెప్పేవాడు.

Jharkhand: నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన పోలీసులు.. విచారణకు ఆదేశించిన సీఎం

ఎంతమందితో అయినా సంబంధాలు కలిగి ఉంటానన్నాడు. వాయిస్, వీడియో కాల్స్ నుంచి పోలీసులు ఈ వివరాలు తెలుసుకున్నారు. కాగా, అమృత్‌పాల్ సింగ్‌ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గత శనివారం నుంచి అతడికోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే అతడి అనుచరుల్లో అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, తాజాగా అమృత్‌పాల్ సింగ్‌ భార్య, తల్లిని కూడా ప్రశ్నిస్తున్నారు. అతడి స్వగ్రామమైన జల్లుపూర్ ఖేరా చేరుకుని మహిళా పోలీసుల ఆధ్వర్యంలో విచారిస్తున్నారు.

అమృత్‌పాల్ సింగ్‌ ఫిల్లాపూర్ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు దొంగతనం చేసిన ఒక బైకును దగ్గర్లోని దారాపూర్ గ్రామంలో వదిలేశాడు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.