Jharkhand: నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన పోలీసులు.. విచారణకు ఆదేశించిన సీఎం

డియోరి పోలీస్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడ్ని పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడి కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోంచి పారిపోయారు.

Jharkhand: నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన పోలీసులు.. విచారణకు ఆదేశించిన సీఎం

Jharkhand: నాలుగు రోజుల శిశువును పోలీసులు తొక్కి చంపారని ఆరోపించారు శిశువు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఝార్ఖండ్, గిరిదిహ్ జిల్లాలోని, కోసోగోండోడిఘి గ్రామంలో బుధవారం జరిగింది. దీనిపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విచారణకు ఆదేశించారు.

Building Collapsed : విశాఖ రామజోగిపేటలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

డియోరి పోలీస్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడ్ని పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడి కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోంచి పారిపోయారు. ఆ సమయంలో ఇంట్లో నాలుగు రోజుల శిశువు మాత్రమే ఉంది. చిన్నారి నిద్రపోతూ ఉండటంతో అలాగే వదిలేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. ఆ ఇంట్లో కొద్దిసేపు పోలీసులు సోదాలు చేసి వెళ్లిపోయారు. తర్వాత కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లేసరికి చిన్నారి శిశువు మరణించి ఉంది.

Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ.. పాత కథ, అన్ని తెలిసిన ట్విస్టులే.. కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్..

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులే తొక్కి చంపారని, శిశువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ రిపోర్టు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సంజయ్ రాణా తెలిపారు. మరోవైపు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.