Bigg Boss 5 Telugu : వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

పాపులర్ యాంకర్ వర్షిణి రెండో వారంలోనే ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోంది..

Bigg Boss 5 Telugu : వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

Varshini

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా టీవీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’.. తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 5 ఇటీవలే స్టార్ట్ అయ్యింది. కింగ్ నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ చేస్తున్నారు.

Priyanka Singh : ‘జబర్దస్త్’ సాయి తేజ నుంచి ‘బిగ్ బాస్ 5’ ప్రియాంక సింగ్ వరకు..

ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లు చేసే హంగామా, హైడ్రామా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ముందుగా ఈ షో లో పలానా వాళ్లు పార్టిసిపెట్ చెయ్యబోతున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి కానీ ఎవరి అంచనాలకు అందకుండా వివిధ కేటగిరీల్లో నుంచి పలువురిని సెలెక్ట్ చేశారు ‘బిగ్ బాస్’ టీం.

Artist Priya : అప్పుడు.. ఇప్పుడు.. నాగార్జునతో ప్రియ.. పిక్ వైరల్..

పాపులర్ యాంకర్ వర్షిణి సౌందర రాజన్ పేరు ప్రముఖంగా వినిపించింది కానీ ఆమె ‘బిగ్ బాస్ 5’ లో పార్టిసిపెట్ చెయ్యలేదు. కట్ చేస్తే ఈ వారం వర్షిణి హౌస్ లోకి రాబోతుందని తెలుస్తుంది. వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందట. సాధారణంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది నాలుగో వారంలో ఉంటుంది. అయితే ఈసారి రెండో ఎపిసోడ్‌లోనే ప్లాన్ చేశారు.

Bigg Boss 5 Telugu : నాగార్జునతో సహా కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతంటే..!