Bigg Boss 5 : యాని మాస్టర్ వెళ్ళిపోతూ ఎవరెవరి గురించి ఏం చెప్పింది??

ఇక యాని మాస్టర్ వెళ్ళిపోతూ స్టేజి మీద నాగార్జున వద్దకు వచ్చి మాట్లాడింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చెప్పమనడంతో యానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చెప్పింది. ముందుగా

Bigg Boss 5 : యాని మాస్టర్ వెళ్ళిపోతూ ఎవరెవరి గురించి ఏం చెప్పింది??

Ani

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో ప్రతి వారం ఎలిమినేషన్ కామన్. ఈ వీకెండ్ లో కూడా యాని మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. 19 మందితో మొదలైన బిగ్ బాస్ ఇప్పటికి 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం యాని మాస్టర్ ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక యాని మాస్టర్ వెళ్ళిపోతూ స్టేజి మీద నాగార్జున వద్దకు వచ్చి మాట్లాడింది.

Kaikala Satyanarayana : తెలుగు వాళ్లకి ‘కేజీఎఫ్‌’ని పరిచయం చేసిన కైకాల

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చెప్పమనడంతో యానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చెప్పింది. ముందుగా రవి నాకు మంచి తమ్ముడిలా ఉన్నాడు. అందుకు రవికి థ్యాంక్స్ అని చెప్పింది. ఇక శ్రీరామ్‌ నాకు మంచి ఫ్రెండ్‌ అని అంది. షణ్ముఖ్‌ ఎప్పుడూ ఉన్నదున్నట్లు మాట్లాడతాడు అని తెలిపింది. సిరి పటాకలా ఆడుతుందని పొగిడింది. ప్రియాంక సీతాకోకచిలుక లాంటిది అని పాజిటివ్ గానే కాంప్లిమెంట్‌ ఇచ్చింది. బయటకొచ్చాక మానస్‌తో మంచి ఫ్రెండ్‌ లా ఉంటాను అని తెలిపింది. సన్నీ కూడా నాకు ఫ్రెండ్‌, అతనిని కచ్చితంగా మిస్‌ అవుతానంది.

Allu Arha : బుర్జ్‌ఖలీఫాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని కొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్హ

ఇక హౌస్ లో తన శత్రువు కాజల్‌ గురించి కూడా వెళ్ళేటప్పుడు ఏమి చెప్పలేదు. హౌస్ లో కొన్ని వారాల నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వెళ్ళేటప్పుడు అయినా అందరితో మాట్లాడినట్లే మాట్లాడుతారు అనుకున్నారు కానీ యానికి కాజల్ పై కోపం తగ్గలేదు. కాజల్ గురించి చెప్పమనడంతో చెప్పడానికి ఏమి లేదని అంది. ఆ తర్వాత అందరికి బై చెప్పేసి వెళ్ళిపోయింది.