Kaikala Satyanarayana : తెలుగు వాళ్లకి ‘కేజీఎఫ్‌’ని పరిచయం చేసిన కైకాల

ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. 'కేజీఎఫ్‌' సినిమాని తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకొచ్చింది మాత్రం కైకాల సత్యనారాయణనే.

Kaikala Satyanarayana : తెలుగు వాళ్లకి ‘కేజీఎఫ్‌’ని పరిచయం చేసిన కైకాల

Kgf Kaikala

Kaikala Satyanarayana :  ‘బాహుబ‌లి’ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ఆ స్థాయిలో హిట్ అయిన సినిమా, కన్నడ నుంచి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ‘కేజీఎఫ్‌’. సినిమా గురించి ఎలాంటి అంచ‌నాలు లేకుండానే రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. అంతే కాక దేశం మొత్తం ‘బాహుబలి 2’ కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు ‘కేజీఎఫ్‌ 2’ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ ఆఖరి దశలో ఉంది. ‘కేజీఎఫ్‌ 2’ ని 2022 ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు.

Samantha : కొత్తదనం కోసం ఆ పాత్ర చేశాను.. నార్త్‌కి, సౌత్‌కి తేడా లేదు : సమంత

అయితే ఈ సినిమా కన్నడలో తీసి కేవలం కన్నడలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్, టీజర్ కి వచ్చిన స్పందనని చూసి అన్ని భాషల్లో రిలీజ్ చేయమని అడగడంతో ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. ‘కేజీఎఫ్‌’ సినిమాని తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకొచ్చింది మాత్రం కైకాల సత్యనారాయణనే.

Allu Arha : బుర్జ్‌ఖలీఫాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని కొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్హ

సినీ కెరీర్‌లో కైకాల స‌త్య‌నారాయ‌ణ ఏడు వంద‌ల‌కు పైగా సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా ఎన్నో పాత్ర‌ల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం వ‌యోభారంతో సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. కైకాల నటించడంతో పాటు ఒక‌ప్పుడు ర‌మా ఫిలింస్ అనే బ్యాన‌ర్‌తో సినిమాల‌ను కూడా నిర్మించారు. కైకాల త‌ర్వాత ఆయ‌న వార‌సుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న కన్నడలో కొన్ని సినిమాలు నిర్మించారు. ఈ క్ర‌మంలోనే ‘కేజీఎఫ్ 1’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేశారు.

Jai Bhim : క్షమాపణలు చెప్పిన ‘జై భీమ్’ డైరెక్టర్

ఈ సినిమా అవుట్ ఫుట్ చూసి హిట్ అవుతుందని భావించి కైకాల సత్యనారాయణకు సినిమా గురించి చెప్పి తెలుగులో రిలీజ్ చేద్దామని అడిగారు. కైకాల సత్యనారాయణ ఓకే అనడంతో మరో నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రంతో కలిసి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వర్షన్ లో టైటిల్స్ కంటే ముందే కైకాల సత్యనారాయణ సమర్పించు అని పడుతుంది. అలా కేజీఎఫ్ ని తెలుగులో కైకాల రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించి మంచి లాభాలని తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలోనే కేజీఎఫ్ యూనిట్‌ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు స‌న్మానం కూడా చేసింది. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’ ని కూడా కైకాల సత్యనారాయణ మరియు వారాహి చలన చిత్రం కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

NTR : ఈఫిల్ టవర్ వద్ద తనయుడికి ముద్దు పెడుతున్న ఎన్టీఆర్

ప్రస్తుతం కైకాల ఆరోగ్యం విషమించడంతో అపోలో హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయన త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు, సినీ ప్రియులు, అభిమానులు కోరుకుంటున్నారు.