Raja Goutham: బ్రహ్మానందం కుమారుడి మరో ప్రయత్నం.. ఆకట్టుకున్న గ్లిమ్ప్స్!

టాలీవుడ్ లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాలా ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. పల్లకిలో పెళ్లికూతురుతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఆ తర్వాత బసంతి, మను లాంటి సినిమాలతో..

Raja Goutham: బ్రహ్మానందం కుమారుడి మరో ప్రయత్నం.. ఆకట్టుకున్న గ్లిమ్ప్స్!

Raja Goutham

Raja Goutham: టాలీవుడ్ లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాలా ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. పల్లకిలో పెళ్లికూతురుతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఆ తర్వాత బసంతి, మను లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు ప్రయత్నిస్తాడనే పేరు సంపాదించుకున్న గౌతమ్ కు ఇప్పటి వరకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాలు వైవిధ్యంగా ఉన్నాయనే పేరు తెచ్చుకున్న కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు.’

New Movies: ఇక్కడ భీమ్లా.. తమిళంలో వలిమై.. హిందీలో అలియా కలెక్షన్ల మోత!

కాగా, మరోసారి గౌతమ్ హీరోగా రూపొందతున్న కొత్త సినిమా గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తో టాలీవుడ్ ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి ప్రోడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా గ్లిమ్ప్స్ లో.. ఒక బ్లాంక్ స్క్రీన్ పై వాయిస్ మొదలవతుంది ‘ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా’ అనే డైలాగ్ తో గౌతమ్ లుక్ రిలీవ్ అవుతుంది.

Movie Releases: సినిమా సీజన్‌గా మార్చి నెల.. అన్నీ క్రేజీ సినిమాలే!

ఈ డైలాగ్ లో గౌతమ్ క్యారెక్టర్ లోని పెయిన్ తెలుస్తుంది. అలాగే లుక్స్ కూడా రచయిత క్యారెక్టర్ ని ఫరెఫెక్ట్ గా మ్యాచ్ చేసే విధంగా ఉన్నాయి. ఆర్టిస్ట్ గా మనుతో సర్ ప్రైజ్ చేసిన గౌతమ్ ఈసారి మరో కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతున్నాడు. మోనోఫోబియాతో బాధపడుతున్న రచయితగా కనిపిస్తున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది..? తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని అతను ఎలా అధిగమించాడు అనేది థ్రిలింగ్ ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతుంది.

New Films Launch: రెడీ.. యాక్షన్ బాబు.. కొత్త సినిమాలతో స్టార్స్ బిజీ

ఈ కాన్సెప్ట్ ని యునిక్ గా తెరకెక్కిచడంలో సుబ్బు చెరుకూరి తన దైన ముద్రను వేసాడని చిత్ర యూనిట్ అంటుంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిషెడ్యూల్ జరుపుకుంటుంది. ఎమ్ యస్ జోన్స్ రూపెర్ట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.