New Films Launch: రెడీ.. యాక్షన్ బాబు.. కొత్త సినిమాలతో స్టార్స్ బిజీ

లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క పనీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. ఏ ఒక్క సినిమా ఫస్ట్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి ధియేటర్లోకి రాలేదు.

New Films Launch: రెడీ.. యాక్షన్ బాబు.. కొత్త సినిమాలతో స్టార్స్ బిజీ

New Films Launch

New Films Launch: లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క పనీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. ఏ ఒక్క సినిమా ఫస్ట్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి ధియేటర్లోకి రాలేదు. ఒకసారి కోవిడ్ తో, మరోసారి రిలీజ్ క్లాష్ తో ఇప్పటికే సినిమాలు చెయ్యడం లేట్ అయిపోయిన హీరోలు ఇప్పుడు అస్సలు రిలాక్స్ అవ్వడం లేదు. ఉన్నసినిమాల్ని కంప్లీట్ చేస్తూ కొత్త సినిమాలతో బిజీగా మారిపోతున్నారు.

NTR 30: ఔను నిజమే.. ఎన్టీఆర్ సినిమాపై అలియా క్లారిటీ!

హీరోలు అసలే మాత్రం లేట్ చెయ్యడం లేదు.. ఎప్పుడు ఏ వైరస్ వచ్చి షూటింగ్ కి అడ్డం పడుతుందో.. డేట్స్ క్లాష్ తో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ కి అడ్డం పడిపోతుందో అని వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. సమయం లేదు మిత్రమా.. సినిమాలు వరసగా చెయ్యాలి మిత్రమా అనుకుంటూ.. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాల్ని సెట్స్ మీదకెక్కించేస్తున్నారు స్టార్లు. ఖిలాడి, రామారావ్ ఆన్ డ్యూటీ, దమాకా సినిమాలతో బిజీగాఉన్న రవితేజ మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు.

SSMB 28: మహేష్-త్రివిక్రమ్-పూజా.. హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు

ఈ మధ్య సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ మీదున్న రవితేజ.. సుధీర్ వర్మతో రావణాసుర మూవీ ని అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేసేశారు రవితేజ. సెట్లో అడుగుపెట్టిన రవితేజ.. ఎగ్జైటింగ్ గా ఉందంటూ టీమ్ తో కలిసి ఫోటో షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో పాటు పూజిత్, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావణాసుర సినిమాలో రవితేజ లాయర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు.

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

సర్కారు వారి పాట సినిమాతో ఫ్రీ అయిపోతున్న మహేష్ కూడా నెక్ట్స్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కబోతున్న సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో ఫుల్ బిజీ అయ్యారు. త్వరలో మొదలవబోతున్న ఈసినిమాకు సంబంధించి థమన్, త్రివిక్రమ్ తో పాటు ప్రొడ్యూసర్ నాగవంశీ కలిసి మహేష్ ఆల్రెడీ దుబాయ్ లో డిస్కషన్స్ కూడా చేశారు.

Allu Arjun: బన్నీ కొత్త యాడ్.. మొన్న బస్ ఎక్కమని.. నేడు తినమని!

అఖండ సినిమాతో మాంచి సక్సెస్ మీదున్న బాలకృష్ణ కూడా తన 107వ సినిమా పనుల్ని స్పీడప్ చేస్తున్నారు. క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో సినిమా అనౌన్స్ చేసేశారు. లాస్ట్ మన్త్ షూటింగ్ స్టార్ట్ చెయ్యాల్సిన సినిమా కోవిడ్ తో పోస్ట్ పోన్ అయ్యింది. ఎట్టి పరిస్తితుల్లో ఈనెల 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని, పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే సినిమా కంప్లీట్ చెయ్యాలని గట్టిగా ప్లాన్ చేసుకున్నారు టీమ్.

Mouni Roy: కొత్త పెళ్లి కూతురు మౌనీ.. హాట్ పోజులు!

ట్రిపుల్ ఆర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి మరో సినిమా వైపు చూడని ఎన్టీఆర్ కూడా కొత్త సినిమా మొదలుపెడుతున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో రెండోసారి సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. కొరటాలతో సినిమా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా తన క్యారెక్టర్ కి సంబంధించి హోమ్ వర్క్ కూడా చేస్తున్నట్టు టాక్.

Aadavaallu Meeku Joharlu: లక్కీ గర్ల్ రష్మిక.. శర్వాకి లక్ కలిసి వస్తుందా?

నాని కూడా తన 29వ సినిమా స్టార్ట్ చేశారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న అంటే సుందరానికి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే కోవిడ్ తో నాని సినిమాలు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యాయి. అందుకే ఈసారి లేట్ చెయ్యకుండా దసరా సినిమా స్టార్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెలంగాణ యాసతో పాటు కంప్లీట్ మాస్ లుక్ లో నాని చేస్తున్న ఈ సినిమా దసరా టైటిల్ తో తెరకెక్కబోతోంది. ఈసారి సంక్రాంతి నిరుడు లెక్క ఉండదంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.