Radhe Shyam: అభిమానులకు మరో ట్రీట్.. దీపావళికి ముహూర్తం

బాహుబలి నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే ముందుగా సంక్రాంతికి రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు..

Radhe Shyam: అభిమానులకు మరో ట్రీట్.. దీపావళికి ముహూర్తం

Radheshyam

Radhe Shyam: బాహుబలి నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే ముందుగా సంక్రాంతికి రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమైన రెబల్ స్టార్ విక్రమాదిత్యగా ప్రమోషన్ కూడా అదే స్థాయిలో మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ సినిమా మీద అంచనాలను పెంచాయగా ఈ మధ్యనే వచ్చిన టీజర్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి. టీజర్ యూట్యూబ్ లో ఇప్పటికీ రికార్డులను తిరగరాస్తుంది.

Samantha: పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్‌కి సలహాలిస్తున్న సామ్!

అదలా ఉండగానే ప్రభాస్ ఇప్పుడు అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాధేశ్యామ్ నుండి మరో ఇంట్రెస్టింగ్ టీజర్ సిద్ధం చేస్తున్నారని టాక్ మొదలైంది. వచ్చే దీపావళి కానుకగా ఈ టీజర్ విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు మొదలు పెట్టారట. ఒక్క దీపావళికి మాత్రమే కాదు.. మళ్ళీ అదే నెలలో ఇంకో అదిరే అప్డేట్ ని రివీల్ చేయనున్నట్టుగా యూనిట్ వర్గాల సమాచారం. సంక్రాంతికి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రెండు నెలల ముందే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.

Bollywood Lovers: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..!

అందుకే దీపావళి, క్రిస్టమస్ ఇలా వరసగా అప్ డేట్స్ ఇచ్చేందుకు సిద్దమైన రాధేశ్యామ్ మేకర్స్.. ఏ మాత్రం హైప్స్ తగ్గకుండా సినిమాను భారీగా ప్రమోట్ చేయనున్నారట. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండనున్నాయని ఇప్పటికే మేకర్స్ టీజర్ ద్వారా చెప్పేసిన సంగతి తెలిసిందే.