Arjun Kapoor : మా సహనాన్ని చేతకానితనంగా భావించి మా సినిమాలని బాయ్‌కాట్‌ చేస్తున్నారు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి..

అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. ''ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై ఇన్ని రోజులుగా మాట్లాడకుండా మేము తప్పు చేశాం. ఈ విషయంపై మేము సరిగ్గా దృష్టి పెట్టలేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే కొంతమంది అవకాశంగా తీసుకొని..........

Arjun Kapoor : మా సహనాన్ని చేతకానితనంగా భావించి మా సినిమాలని బాయ్‌కాట్‌ చేస్తున్నారు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి..

Arjun Kapoor :  ఇటీవల బాలీవుడ్‌ సినిమాలని వ్యతిరేకిస్తూ సోషల్‌మీడియాలో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొన్నే ఆమిర్‌ ఖాన్‌ – కరీనా కపూర్‌ల కొత్త సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమాని అమీర్ ఖాన్ గతంలో దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ బాయ్‌కాట్‌ చేశారు. సోషల్ మీడియాలో కొన్ని రోజుల వరకు ఇది ట్రెండింగ్ గా నిలిచింది. ఇటీవలే కొంతమంది తాప్సి సినిమాని కూడా బాయ్ కాట్ చేయాలని కామెంట్స్ చేశారు. ఇక లాల్‌ సింగ్‌ చడ్డా సినిమాని సపోర్ట్ చేసినందుకు హృతిక్‌ రోషన్‌పై కూడా నెటిజన్లు సీరియస్ అవుతూ తన నెక్స్ట్ సినిమా విక్రమ్‌ వేదని కూడా బాయ్ కాట్ చేయాలంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై ఇటీవల కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ స్పందించారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై బాలీవుడ్ యువ హీరో అర్జున్‌ కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై మాట్లాడారు.

అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. ”ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై ఇన్ని రోజులుగా మాట్లాడకుండా మేము తప్పు చేశాం. ఈ విషయంపై మేము సరిగ్గా దృష్టి పెట్టలేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే కొంతమంది అవకాశంగా తీసుకొని ఇలా చేస్తున్నారు. మన టాలెంట్‌ గురించి మన సినిమా మాట్లాడుతుంది అనే సిద్ధాంతాన్ని నమ్మడం వల్లే మేము సైలెంట్‌గా ఉన్నాం. ఇప్పటికే చాలా భరించాం. మా సహనాన్ని కొంతమంది చేతకానితనంగా భావించి ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ని అలవాటుగా మార్చుకున్నారు. సోషల్‌మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వార్తలు, హ్యాష్‌ట్యాగ్స్‌ సృష్టిస్తూ మాపై బురద జల్లుతున్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ నటీనటులు అందరూ కలిసి దీనిపై చర్యలు తీసుకోవాలి. ఈ బాయ్ కాట్ ట్రెండ్‌ని సృష్టిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్లకు పంపనున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. మూడు విభాగాల్లో..

అయితే హృతిక్ రోషన్ కేవలం లాల్ సింగ్ చాడా సినిమాకి సపోర్ట్ ఇచ్చినందుకే అతని సినిమాని కూడా బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ ఏకంగా ఇలా బాయ్ కాట్ చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. మరి అర్జున్ కపూర్ ని ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తారో, అర్జున్ కపూర్ సినిమాలని ఏ రేంజ్ లో బాయ్ కాట్ అని ట్రెండ్ చేస్తారో చూడాలి.