Liger: పూరి కోసం బాలయ్య.. లైగర్‌లో క్యామియో రోల్?

బాలయ్య మాస్ జాతర మొదలైంది. అఖండ విజయంతో బాలయ్య ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చాడు. కరోనా తర్వాత రావాలా వద్దా అనే సినిమాలకు కొండత భరోసా ఇచ్చాడు బాలయ్య.

Liger: పూరి కోసం బాలయ్య.. లైగర్‌లో క్యామియో రోల్?

Liger

Liger: బాలయ్య మాస్ జాతర మొదలైంది. అఖండ విజయంతో బాలయ్య ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చాడు. కరోనా తర్వాత రావాలా వద్దా అనే సినిమాలకు కొండత భరోసా ఇచ్చాడు బాలయ్య. అఖండతో మొదలైన ఈ సినిమా జాతరను కంటిన్యూ చేసేందుకు వరసగా స్టార్స్ క్యూ కడుతున్నారు. కాగా.. ఇప్పుడు బాలయ్య ఓ సినిమాలో క్యామియో రోల్ లో గెస్ట్ రోల్ చేయనున్నాడనే వార్త ఆసక్తిగా మారింది. బాలకృష్ణ పూరి జగన్నాద్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

Sekhar: రాజశేఖర్ సినిమాపై ఓటీటీల చూపు.. కళ్ళు చెదిరే ధర!

పైసా వసూల్ ఫలితం ఎలా ఉన్నా బాలయ్య ఇలా కూడా నటిస్తాడా అనేలా పక్కా మాస్ యాంగిల్ లో డిఫరెంట్ గా కనిపించాడు. దర్శకుల హీరోగా బాలయ్య పూరి ఫెవరెట్ గా మారిపోతే బాలయ్యకు కూడా పూరితో బాండింగ్ ఏర్పడింది. దీంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నట్లు ఇద్దరూ చెప్పేశారు. కాగా, ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాలో ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Pushpa: తగ్గేదేలే.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ వచ్చేస్తున్నాయ్

బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ తో కలిసి పూరి, ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ నుండి సౌత్ లో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా.. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పుడు ఓ ప్రచారం జరుగుతుంది. ఒక క్యామియో రోల్ లో బాలయ్య అలరించనున్నాడని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ పూరితో బాలకృష్ణకి మంచి అనుబంధం ఉంది కనుక ఈ కాంబినేషన్ సెట్టైనా కావచ్చు. ఏదైనా అధికారికంగా ప్రకటన వస్తేనే కానీ కన్ఫర్మ్ కాదు.