Sekhar: రాజశేఖర్ సినిమాపై ఓటీటీల చూపు.. కళ్ళు చెదిరే ధర!

కరోనా తర్వాత ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. థియేటరా.. ఓటీటీనా అనే రేంజ్ లో పోటీ నెలకొంది. ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలను తెరకెక్కించి డైరెక్ట్ స్ట్రీమింగ్..

Sekhar: రాజశేఖర్ సినిమాపై ఓటీటీల చూపు.. కళ్ళు చెదిరే ధర!

Untitled Design

Sekhar: కరోనా తర్వాత ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. థియేటరా.. ఓటీటీనా అనే రేంజ్ లో పోటీ నెలకొంది. ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలను తెరకెక్కించి డైరెక్ట్ స్ట్రీమింగ్ ఇస్తుంటే మరికొన్ని సంస్థలు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సినిమాలను ఫ్యాన్సీ రేటుకు కొనేసుకొని స్ట్రీమింగ్ ఇస్తున్నారు. థియేటర్ లో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ స్ట్రీమింగ్ కు భారీ ధరలను కూడా ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అందుకే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో వచ్చేస్తున్నాయి.

Pushpa: తగ్గేదేలే.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ వచ్చేస్తున్నాయ్

ఒకపక్క మళ్ళీ పాత రోజులు వచ్చేలా థియేటర్స్ రిలీజ్ కోసం సన్నాహాలు జరుగుతున్నా.. ఓటీటీలు మాత్రం ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసిన కొన్ని సినిమాలను ఎలాగైనా డైరెక్ట్ ఓటీటీ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా బజ్ క్రియేట్ చేసిన యాంగ్రీ మెన్ రాజశేఖర్ ‘శేఖర్’ సినిమాపై ఇప్పుడు ఓటీటీల చూపు పడింది. డైరక్ట్ రిలీజ్ కోసం ఓటీటీలు శేఖర్ సినిమాకు 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయట. పెద్దగా మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోల సినిమాకి ఓటీటీలు ఈ రేంజ్ లో పెట్టడం వెనక చాలా కారణాలే ఉన్నాయి.

Ajith Kumar: నయా ట్రెండ్.. తోకలొద్దు.. నా పేరే నాకు ముద్దు!

ఇప్పటికే విడుదలైన శేఖర్ గ్లింప్స్ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేశాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఈ సినిమా జానర్ కూడా మరో కారణం కాగా ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్ కు రీమేక్ కావడంతో ఓటీటీలు ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకునేందుకు భారీ స్థాయి ఆఫర్లు ఇస్తున్నారట. శేఖర్ రీమేక్ మూవీ అయినప్పటికీ మెయిన్ సోల్ మిస్ కాకుండా కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేయడంతో పాటు తెలుగు ఆడియన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ రీమేక్ కి జీవిత రాజశేఖర్ డైరక్టర్ కాగా స్క్రీన్ ప్లే కూడా ఆమెనే చూసుకుంకుంటుంది. మరి ఓటీటీకి ఇచ్చేస్తారా లేక థియేటర్లలో వదులుతారో చూడాలి.