Lady Villains: నెగెటివ్ రోల్స్‌‌కి సై అంటున్న అందమైన భామలు!

ఐ క్యాండీగా స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌ చేసేయడం.. బబ్లీనెస్‌తో హీరోను బబుల్‌గమ్‌లా చుట్టేయడమే కాదు.. అవసరమైతే లేడీ విలన్స్ గానూ భయపెడతామంటున్నారు హీరోయిన్స్. పవర్‌ ఫుల్‌ సినిమా పడాలే..

Lady Villains: నెగెటివ్ రోల్స్‌‌కి సై అంటున్న అందమైన భామలు!

Lady Villains

Lady Villains: ఐ క్యాండీగా స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌ చేసేయడం.. బబ్లీనెస్‌తో హీరోను బబుల్‌గమ్‌లా చుట్టేయడమే కాదు.. అవసరమైతే లేడీ విలన్స్ గానూ భయపెడతామంటున్నారు హీరోయిన్స్. పవర్‌ ఫుల్‌ సినిమా పడాలే కానీ నెగెటివ్ రోల్స్‌ కి సై అనేస్తున్నారు. ఇప్పుడలాంటి సినిమాల్లో చాలామంది అందగత్తెలు భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

Shanmukh-Deepthi: దీప్తికి ఇదే షణ్ముఖ్ చివరి ముద్దు.. వీడియో వైరల్!

రీసెంట్ గా లేడీ విలన్ క్లబ్ లో జాయినయింది దక్ష నగార్కర్. రవితేజ రావణాసుర సినిమాలో నెగటివ్ షేడ్స్ చూపించబోతుంది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ మాస్ మూవీ డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతోంది. ఇందులో దక్షకి సూపర్ ఆఫర్ తగిలినట్టు చెప్తున్నారు. ఇదివరకు హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగులో మెప్పించినా అనుకున్నన్ని అవకాశాలు రాలేదు. మరి మాస్ రాజాని ఢీకొట్టబోతున్న రోల్ అయినా దక్షాకు కలిసొస్తుందేమో చూడాలి.

Summer Movies Release: ఏప్రిల్ వార్.. ఈసారి ఎవరు అడ్డొచ్చినా తగ్గేదే లే!

తమిళ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్.. స్పెషల్ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రాస్ గా మారారు. హీరోయిన్‌, లేడీ విలన్‌ , స్పెషల్ క్యారెక్టర్ అనే తేడాలేకుండా మంచి ఛాన్స్ దొరికితే చేసేస్తున్నారు. సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకష్ణతో 2021 బ్లాక్ బస్టర్ క్రాక్‌లోను పవర్‌ ఫుల్‌ నెగటివ్‌ పాత్రలో కనిపించారు వరలక్ష్మి. ఇప్పుడు అదే క్రాక్ డైరెక్టర్ చేయబోతున్న బాలయ్య సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్నారు. బాలయ్యకు ధీటుగా వరలక్ష్మీ శరత్ కుమార్ రోల్ ను మలినేని ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు.

Netflix-Prime Video: మాటకు మాట.. నెట్‌ఫ్లిక్స్-ప్రైమ్ వీడియో ట్విట్టర్ వార్!

ఇంతవరకు కామియో రోల్స్, స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడిన యాంకర్ అనసూయ.. పుష్పలో లేడీ విలన్ గానే కనిపించింది. కానీ ఎక్కువ సీన్స్ దక్కలేదు. అయితే పుష్ప పార్ట్ 2లో మాత్రం అనసూయ విలనిజం హైలైట్ అవుతుందనే టాక్ ఉంది. తన 50వ సినిమా గుర్తుండిపోయేలా ఉండాలని నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్ చేసింది హన్సిక. మహా సినిమాలో ‘హన్సిక మహా విలన్ గా కనపించబోతుంది. అనేక వాయిదాల తర్వాత సినిమా 2022లో రిలీజ్ అయ్యేలా చూస్తున్నారు. ప్రస్తుతం 9 సినిమాలు చేతిలో ఉన్న హన్సిక.. అందులో రెండుకు పైగా సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ చూపించబోతుంది.

Ramesh Babu: మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్!

ఫ్యామిలీ మ్యాన్ 2లో విలనిజంతో మెప్పించింది సమంతా. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి మళ్లీ అలాంటి వెబ్ సిరీసే చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ స్పిరిట్ మూవీలో కరీనా కపూర్ లేడీ విలన్ అవతారం ఎత్తబోతుందనే టాక్ ఉంది. రామ్ చరమ్ – శంకర్ సినిమాలో ఇషా గుప్తా కూడా కన్నింగ్ లేడీగా నటిస్తుందని చెప్తున్నారు.