Summer Movies Release: ఏప్రిల్ వార్.. ఈసారి ఎవరు అడ్డొచ్చినా తగ్గేదే లే!

కోవిడ్ వచ్చినా, కోవిడ్ లో కొత్త వేరియంట్ వచ్చినా, బరిలోకి ఏ స్టార్ హీరో దిగినా, రిలీజ్ కు ఏ టాప్ హీరో అడ్డం పడినా సమ్మర్ లో అసలు తగ్గేదే లే అంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి..

Summer Movies Release: ఏప్రిల్ వార్.. ఈసారి ఎవరు అడ్డొచ్చినా తగ్గేదే లే!

Summer Movies Release

Summer Movies Release: కోవిడ్ వచ్చినా, కోవిడ్ లో కొత్త వేరియంట్ వచ్చినా, బరిలోకి ఏ స్టార్ హీరో దిగినా, రిలీజ్ కు ఏ టాప్ హీరో అడ్డం పడినా సమ్మర్ లో అసలు తగ్గేదే లే అంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా స్టార్ సినిమాలు ఏం రిలీజ్ కాకపోవడంతో సమ్మర్ లోనే.. స్పెషల్లీ ఏప్రిల్ లో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు స్టార్లు. మన సినిమాలే ప్యాకప్ అయిపోయి ఉంటే కేజీఎఫ్ కూడా ఏప్రిల్ వార్ నుంచి తప్పుకునేది లేదంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది.

Netflix-Prime Video: మాటకు మాట.. నెట్‌ఫ్లిక్స్-ప్రైమ్ వీడియో ట్విట్టర్ వార్!

స్టార్ హీరోల మద్య సంక్రాంతి వార్ తప్పిపోయింది. కానీ సమ్మర్ వార్ మాత్రం కంటిన్యూ అయ్యే లానే కనిపిస్తోంది. స్పెషల్లీ ఏప్రిల్ లో సినిమా రిలీజ్ లు మాత్రం తగ్గేదే లేదంటున్నాయి. లేటెస్ట్ గా యష్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో.. ఏప్రిల్ 14నే సినిమా రిలీజ్ అని మరోసారి కన్ ఫామ్ చేసింది టీమ్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన కేజీఎఫ్ 2.. కోవిడ్ తో పోస్ట్ పోన్ అయ్యింది. అప్పుడే ఏప్రిల్ 14 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే ఈ మధ్య పరిస్థితులు మారినా.. రిలీజ్ డేట్ మాత్రం మారలేదంటూ లేటెస్ట్ గా మరోసారి కన్ ఫామ్ చేశారు యష్.

Ramesh Babu: మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్!

కేజేఎఫ్ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ మూవీ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సలార్, కేజేఎఫ్ 2 రెండు డైరెక్ట్ చేస్తోంది ప్రశాంత్ నీలే. అయితే సలార్ మాత్రం పోస్ట్ పోన్ అవుతుందని పక్కాగా అంటోంది టీమ్. అసలు ఏప్రిల్ మిడ్ కంటే ముందే.. ఏప్రిల్ ఫస్ట్ నే మహేష్ బాబు సమ్మర్ వార్ స్టార్ట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో నుంచి విత్ డ్రా అయిన సర్కారు వారి పాట.. ఏప్రిల్ ఫస్ట్ కి డేట్ ఫిక్స్ చెయ్యడంతో.. సమ్మర్ సీజన్ లో వస్తున్న పెద్ద సినిమాగా నిలుస్తోంది.

Samantha : నేను మానసిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు తోడున్నది వాళ్లే : సమంత

ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మాత్రం వార్ ఊపందుకుంటుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లుతో పాటు.. ఎఫ్ 3 కూడా ఏప్రిల్ 29నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అంతేకాదు.. నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ఏప్రిల్ 29నే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఏప్రిల్ వార్ బరిలోకి.. ఎవరడ్డొచ్చినా తగ్గేదే లే అంటూ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి వీరిలో తగ్గేది ఎవరో వచ్చేది ఎవరో చూడాలి.