KGF2-Beast: భారీ బడ్జెట్.. గ్రాండ్ మేకింగ్.. ఇద్దరు బడా స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్!

ఈ వారం ఇంట్రస్టింగ్ సినిమాలు ఆడియన్స్ కోసం రెడీ అవుతున్నాయి ధియేటర్లు. వరస పెట్టి స్టార్ హీరోల మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ రిలీజ్ అవ్వడంతో ఫాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

KGF2-Beast: భారీ బడ్జెట్.. గ్రాండ్ మేకింగ్.. ఇద్దరు బడా స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్!

Kgf2 Beast

KGF2-Beast: ఈ వారం ఇంట్రస్టింగ్ సినిమాలు ఆడియన్స్ కోసం రెడీ అవుతున్నాయి ధియేటర్లు. వరస పెట్టి స్టార్ హీరోల మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ రిలీజ్ అవ్వడంతో ఫాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ వారం అటు తమిళ్ సినిమా బీస్ట్, ఇటు కన్నడ సినిమా కెజిఎఫ్ 2 నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, గ్రాండ్ మేకింగ్.. ఇలా ప్రతి దాన్లో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న బీస్ట్, కెజిఎఫ్ 2 ఈవారమే ఒక్క రోజు తేడాతో ధియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి.

KGF2: కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్!

ఈ వారం పెద్ద సినిమాల పండగ.. తమిళ్ స్టార్ హీరో విజయ్ తోస్టార్ట్ అవుతోంది. విజయ్, పూజాహెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీగా తెరకెక్కిన బీస్ట్ మూవీ.. ఏప్రిల్ 13 గురువారం వరల్డ్ వైడ్ గా ధియేటర్లో రిలీజ్ అవుతోంది. టైటిల్ కి తగ్గట్టే బీస్ట్ అంత పవర్ పుల్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది ఈ మూవీ. టీజర్లు, ట్రైలర్లు, పాటలతో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈమూవీ కోసం విజయ్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

KGF2 -Beast: కన్నడ-తమిళ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన షారుఖ్!

అసలు సిసలు యాక్షన్ మ్యానియాని చూపించడానికి ఆడియన్స్ ముందుకు వస్తోంది కెజిఎప్ 2 మూవీ. ఫస్ట్ పార్ట్ తో సెన్సేషన్ హిట్ అయ్యి కన్నడ సినిమాకు సంబంధించి కలెక్షన్ల రికార్డులు సెట్ చేసిన కెజిఎఫ్..ఇప్పుడు పార్ట్ 2లో మరింత యాక్షన్, మరింత గ్రాండ్ నెస్ తో వస్తోంది. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. భారీ స్టార్ కాస్ట్ తో బాలీవుడ్ నుంచి రవీనాటాండన్, సంజయ్ దత్ లాంటి పవర్ పుల్ నటులతో తెరకెక్కిన కెజిఎఫ్ 2.. ఆల్ ఓవర్ ఇండియా విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఏప్రిల్ 14 శుక్రవారం వరల్డ్ వైడ్ గా ధియేటర్లో రిలీజ్ అవుతోంది.