KGF2: కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్!
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ మూవీ ‘కేజీఎఫ్’కు..

Kgf2 Advance Bookings Report
KGF2: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ మూవీ ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌గా తెరకెక్కించడంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాతో హీరో యశ్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ మూవీ మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయనే విషయంపై సినీ ఎక్స్‌పర్ట్స్ కన్నేస్తున్నారు.
KGF2: కేజీఎఫ్ 2 ఎడిటర్ ఎవరో తెలిస్తే అవాక్కవడం ఖాయం!
ఇప్పటికే ఈ సినిమా హిందీ వర్షన్‌కు భారీ క్రేజ్ రావడంతో, అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఇప్పటికే రూ.12.5 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హిందీ సర్క్యూట్‌లో ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ డే వసూళ్లను కేజీఎఫ్ 2 అలవోకగా దాటేస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హిందీ బెల్ట్‌లో ఆర్ఆర్ఆర్ తొలిరోజు రూ.19 కోట్ల మేర వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
KGF2: భారీ ఓపెనింగ్స్‌పై కన్నేసిన కేజిఎఫ్2.. బాక్స్ బద్ధలేనా?
దీంతో మరో రెండు రోజుల సమయం ఉండటంతో కేజీఎఫ్ 2 చిత్రం ఈ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి నిజంగానే హిందీలో ఆర్ఆర్ఆర్ తొలిరోజు వసూళ్లను కేజీఎఫ్ 2 క్రాస్ చేసి తన సత్తా చాటుతుందా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక యశ్ మరోసారి రాఖీ భాయ్ పాత్రలో తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునేందుకు రెడీ కాగా, అందాల భామ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.