KGF2: భారీ ఓపెనింగ్స్‌పై కన్నేసిన కేజిఎఫ్2.. బాక్స్ బద్ధలేనా?

ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే.. గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టాల్సిందే. ఈమధ్యే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించి ఆర్ఆర్ఆర్ గట్టెక్కింది. ఇప్పుడు అదే రేంజ్ లో కేజిఎఫ్..

KGF2: భారీ ఓపెనింగ్స్‌పై కన్నేసిన కేజిఎఫ్2.. బాక్స్ బద్ధలేనా?

Kgf2

KGF2: ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే.. గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టాల్సిందే. ఈమధ్యే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించి ఆర్ఆర్ఆర్ గట్టెక్కింది. ఇప్పుడు అదే రేంజ్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా సత్తా చాటేలా అడుగులు వేస్తోంది. కేజిఎఫ్ చాప్టర్ వన్ అందరికీ నచ్చడంతో వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి చాప్టర్ 2 పైన విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రెజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఆ హవా కనిపిస్తోంది.

KGF2: ఆర్ఆర్ఆర్‌ను క్రాస్ చేసిన కేజీఎఫ్2..?

అడ్వాన్స్ బుకింగ్ తోనే కేజీఎఫ్ చాప్టర్ 2 దడదడలాడిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబో కేజిఎఫ్ చాప్టర్ 2 కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం హై రేంజ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం బుక్ మై షోలో 1 .5 మిలియన్ ప్లస్ మెంబర్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి ఉందన్నారు. అయితే హిందీ వెర్షన్ లో మాత్రం ఫస్ట్ డే ఓపెనింగ్స్ 20 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా కొచ్చాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లోనే బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ తో రికార్డు సెట్ చేయాలని చూస్తున్నారు కేజిఎఫ్ 2 మేకర్స్.

KGF2 -Beast: కన్నడ-తమిళ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన షారుఖ్!

హిందీ వెర్షన్ లో కేజిఎఫ్ 2 సినిమాను రవీనా టండన్ హస్బెండ్ అనిల్ తడాని, ఫరాన్ అక్తర్ రిలీజ్ చేస్తున్నారు. రవీనా టాండన్ ఈ సినిమాలో పొలిటిషియన్ రోల్ లో నటిస్తే, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ అధీరా గా ప్రతినాయకుడి పాత్రలో విశ్వరూపం చూపించబోతున్నారని చెబుతున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గడంలేదు. ఎస్పెషల్లీ ట్విట్టర్ ఈ సినిమా ప్రమోషన్ లో కీలకంగా వ్యవహరిస్తుంది. ఫస్ట్ టైమ్ ట్విట్టర్ హాష్ టాగ్ తో కేజిఎఫ్ స్టార్ యశ్ ఎమోజీస్ లైవ్ లోకి తీసుకొచ్చి ఈ సినిమా ప్రమోషన్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లింది.

KGF2: కేజీఎఫ్2కు తోడుగా సలార్.. సర్‌ప్రైజ్ ఇస్తారా?

కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమాను కూడా రీ రిలీజ్ చేసి, గతంలో ఫస్ట్ పార్ట్ చూడని వాళ్లకు చూసే ఛాన్స్ ఇచ్చింది టీమ్. ఇక ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చాప్టర్ 2 పైన ఆడియన్స్ కు భారీ అంచనాలేర్పడ్డాయి. అందరి ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అయ్యే విధంగా సినిమా ఉంటుందని స్పష్టం చేశారు ప్రశాంత్ నీల్ టీమ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రయిలర్స్ కూడా ఈ సినిమా పైన అంచనాలను మరింత పెంచుతున్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. కలెక్షన్స్ తో ఎన్నెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు కేజిఎఫ్ 2 ఫ్యాన్స్.